పచ్చని సంసారానికి సన్నీ లియోన్ నీతిసూక్తులు..

అవును.. నమ్మడానికి కాస్త కష్టమే.. సన్నీ లియోన్ సంసారం గురించి మాట్లాడుతుంటే కామెడీగానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇదే జరిగింది కూడా. నిజంగానే సన్నీలియోన్ ఇప్పుడు తన సంసారం గురించి కాకుండా ఏకంగా అందరి సంసారాల గురించి నోరు విప్పింది. అసలు పండంటి కాపురం అంటే ఎలా ఉంటుందో.. ఎలా ఉంటే పచ్చని సంసారం పది కాలాల పాటు నిలబడుతుందో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అసలే అక్కడున్నది సన్నీలియోన్.. ఆమె గురించి చెప్పడానికి మాటలు కూడా చాలవు. అందాలన్నీ ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంటుంది సన్నీలియోన్. కానీ అప్పుడప్పుడూ ఇలాంటి విలువైన మాటలు కూడా బయటపెడుతుంది ఈ ముద్దుగుమ్మ. పార్ట్ నర్ ను ఎంత కంట్రోల్ చేస్తే సంసారం కూడా అంత బాగుంటుందని సలహా ఇస్తుంది సన్నీ. కచ్చితంగా అబ్బాయిలను కంట్రోల్ చేసే శక్తి అమ్మాయిలకు ఉన్నపుడే వాళ్ల కాపురం బాగుంటుందని చెబుతుంది. ఓవైపు అందాలు ఆరబోస్తూనే.. మరోవైపు అందమైన సలహాలు కూడా ఇస్తున్న సన్నీని చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. మగాడు అనే అహంకారం లేకుండా అమ్మాయిలను చేరదీసినపుడు.. వాళ్లకు కావాల్సింది ఇచ్చినపుడు సంసారం అనేది సాఫీగా సాగిపోతుందని చెబుతుంది. అప్పుడప్పుడూ ఫోన్ చెకింగ్స్ కూడా చేయాలని.. అలా చేస్తే ఒకరిపై ఒకరికి భయంతో పాటు నమ్మకం కూడా పెరుగుతుందని చెబుతుంది సన్నీలియోన్. మరి ఈమె చెప్పినవన్నీ చేస్తే ఆ కాపురం పదికాలాల పాటు ఉంటుందో లేదో చూడాలిక.