వరలక్ష్మీ మీద కో స్టార్ సంచలన వ్యాఖ్యలు...పెళ్లి చేసుకోనన్న వరలక్ష్మీ

సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ మీద ఆమె సహ నటుడు విమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ముత్తుకుమార్ దర్శకత్వంలో 'కాన్ని రాశి'లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మధ్యనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కి సిద్దం అవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఈ ఇద్దరూ కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ పై నటుడు విమల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అదేంటంటే ఈ సందర్భంగా విమల్ మాట్లాడుతూ నేను తొలిసారి ఓ మగాడికి జోడీగా నటించానని అనేశారు. ఆ తర్వాత ఆమె ఏమనుకుంటుందో అనుకున్నాడో ఏమి కానీ ఆమెతో కలిసి పనిచేయడంలో నాకు ఎలాంటి ఇబ్బందికి కలుగలేదని, ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా సహజంగా ఉంటుంది. కెమెరా ఆన్ అనగానే ఆమె వెంటనే పాత్రలో లీనమై పోయి సహజంగా నటిస్తుందని కవర్ చేసుకున్నాడు విమల్. ఇక ఇదే ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లి గురించి కూడా ఆసక్తికరంగా స్పందించింది. అదేంటంటే తాను ప్రేమ వివాహం చేసుకుంటానా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానా? అనే సంగతేమో గానీ అసలు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం కూడా తనకు లేదని ఆమె తెలిపింది. నిజానికి గతంలో తమిళ హీరో విశాల్ ను ఆమె పెళ్లి చేసుకుంటారంటూ అప్పట్లో ప్రచారం జరిగేది.