English   

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రంగం సిద్దం...బాహుబలి రేంజ్ లోనే 

Saaho
2019-08-14 23:00:01

దేశంలో అతిపెద్ద సినిమా పండుగకి రంగం సిద్దం అవుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు సాహో ఫీవర్ మొదలయ్యింది. సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండడంతో ఈ సినిమా విడుదల ముందు ఎంతో భారీ ఎత్తున ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక ను జరపనున్నారు. ఊహించినట్టుగానే ఈనెల 18న సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్‌ను కూడా ఇంతకుమున్దులాగే నాలుగు భాషల్లో షేర్ చేసింది. 2019 బిగ్గెస్ట్ నైట్‌కి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 18న సాయంత్రం 5 గంటల నుంచి సాహో ప్రీ రిలీజ్ వేడుకతో ‘సాహో’ను సెలబ్రేట్ చేసుకుందాం’’ అని యూవీ క్రియేషన్స్ ట్వీట్‌లో పేర్కొంది. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాని రన్ రాజా రన్ ఫేం సుజీత్ తెర‌కెక్క‌గా, ఆగ‌స్ట్ 30న పెద్ద ఎత్తున తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.  బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదిరిగానే దీన్నీ ఒక రేంజ్ లో జ‌రిపేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ సరసన శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాని ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్‌, విక్కీలు నిర్మిస్తున్నారు.  

More Related Stories