English   

నన్ను చేసుకోవాలంటే అలా ఉండాలంటున్న శృతి హాసన్.. 

 shruthi haasan
2019-08-15 07:57:30

శృతి హాసన్ కు ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి మాదిరే అన్నింట్లోనూ టాలెంట్ చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మొన్నటి వరకు వరస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకున్న శృతి హాసన్ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయింది. సినిమాలు చేయడం లేదు కానీ సరైన అవకాశాల కోసం వేచి చూస్తుంది. ఇక మాట్లాడటంలో కూడా ఉన్నదున్నట్లు తండ్రిని దించేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎవరేం అనుకుంటారు అనే భయం లేకుండా బోల్డ్ గా మాట్లాడేస్తుంది శృతి హాసన్. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తన పెళ్లి గురించి వచ్చిన టాపిక్ లో మనసులో ఉన్నదున్నట్లు బయట పెట్టింది ఈ బ్యూటీ. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటూ ప్రశ్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. తనకు అన్నీ ఉన్నపుడు మరో కొత్త వ్యక్తికి జీవితంలో ఆహ్వానించడం ఎందుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజం చెప్పాలంటే తనకు పెళ్ళి అంటే భయమని చెబుతుంది శృతి హాసన్. దానికి కారణం కూడా లేకపోలేదు. తన జీవితంలోనే తండ్రి కమల్ ను చూసింది కదా.. ఆయన కూడా పెళ్లికి వ్యతిరేకమే. ఇదే ప్రభావం ఇప్పుడు శృతి హాసన్ పై కూడా కనిపిస్తుంది. తనకు కాబోయేవాడు దయ, జాలి కలిగి ఉండాలని.. అన్నింటికీ మించి నిజాయతీపరుడు అయి ఉండాలని కండీషన్స్ పెడుతుంది శృతి హాసన్. తనను చేసుకునే వాడికి గడ్డం కూడా ఉండాలని.. దాన్ని తీసేస్తే తాను చుక్కలు చూపిస్తానంటుంది శృతి హాసన్. తమ ఇంట్లో బ్లేడ్లు.. రేసర్లు లేకుండా జాగ్రత్త పడతానని.. ట్రిమ్మింగ్ చేసుకోనివ్వనని విచిత్రమైన కండీషన్లు పెట్టేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అన్నింటికి మించి తనకు మంచి మొగుడు కావాలంటుంది శృతి హాసన్. మరి ఈమె కండీషన్లకు ఒప్పుకుని వచ్చే వరుడు ఎక్కడున్నాడో..? 

More Related Stories