బోస్ అవతారం ఎత్తిన ఎన్టీఆర్ కొడుకు

స్వాతంత్ర్య దినోత్సవం సరికొత్తగా జరుపుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు పైగానే అయ్యింది. గాంధీజీ నేతృత్వంలో నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్య పోరాటం చేస్తే గన్నుకు గన్నే సమాధానం అని నమ్మి పోరాటం చేశారు సుభాష్ చంద్రబోస్. ఈ స్వతంత్ర దినం నాడు ఆయన గెటప్‌లో దర్శనమిచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్. తన పెద్ద కొడుకు అభయ్ ని సుభాష్ చంద్రబోస్‌లా తయారు చేసి ఆ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఎన్టీఆర్.
చాన్నాళ్ళ తర్వాత అభయ్ అభిమానులకి దర్శనం ఇచ్చాడు. ఇక అభయ్ లుక్ అభిమానులని ఆకట్టుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన నటించనున్నది ఎవరు అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమా పూర్తి అయ్యాక ఆయన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడని అంటున్నారు. దీని మీద పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.