English   

అల వైకుంఠ‌పుర‌ములో..అల్లు అర్జున్ త్రివిక్రమ్

 Ala Vaikunthapuramulo
2019-08-15 13:43:26

అనుకున్నట్టే అయ్యింది, కొద్ది రోజుల నుండి ప్రచారం జరుగుతున్నట్టే అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాకి అల వైకుంఠ‌పుర‌ములో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇప్పటి దాకా ఈ సినిమాకి రకరకాల పేర్లు ప్రచారం అయ్యాయి. ప్రస్తుతానికి ఈ సినిమాని అల్లు అర్జున్ 19 అనే పేరుతో సంభోదిస్తున్నారు. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రొజెక్ట్ చేసే సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాకి ‘నాన్న.. నేను’, అలకనంద అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. అవన్నీ కాదని అల వైకుంఠపురంలో అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

సినిమాకి సంబంధించి గ్లింప్జ్ అంటూ ఒక కూడా విడుద‌ల చేయ‌గా అందులో ముర‌ళీ శర్మ ఏంటిరా గ్యాప్ ఇచ్చావు అని బ‌న్నీని అడ‌గ‌గా ఇవ్వ‌లా వ‌చ్చింద‌ని అంటారు. అంటే ఇన్ డైరెక్ట్ గా బన్నీ సినిమాల గురించి గ్యాప్ వచ్చిందని అంటున్నారు. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ఈ చిత్రం రూపొందుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రావు రమేష్ స్థానంలో మురళీ శర్మ ఈ సినిమాలో తండ్రి పాత్ర పోషించనున్నారని సమాచారం.
 

More Related Stories