English   

రణరంగం రివ్యూ

RANARANGAM
2019-08-15 15:19:56

రణరంగం.. తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత వచ్చిన గ్యాంగ్ స్టర్ డ్రామా. పైగా మద్యపాన నిషేధం కాన్సెప్టుతో వచ్చిన సినిమా ఇది. 1995 కథ నుంచి నేటి వరకు లింక్ పెడుతూ సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.. 

కథ:

1995లో విశాఖపట్నంలో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ జీవనం సాగించే కుర్రాడు దేవా (శర్వానంద్). అలాంటి సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం విధిస్తాడు. దాన్ని యూజ్ చేసుకుంటూ ఇగ్లీగల్ లిక్కర్ బిజినెస్ మొదలు పెడతారు దేవా, అతడి స్నేహితులు. ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా తరలిస్తారు. అదే సమయంలో దేవాకు గీత (కళ్యాణి ప్రియదర్శన్) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు దేవా. ఇక ఈయన లిక్కర్ బిజినెస్ కూడా బాగానే రన్ అవుతున్న సమయంలో ఆ ఊరు ఎమ్మెల్యే సింహాచలం (మురళీ శర్మ)తో దేవా గ్యాంగ్ కు గొడవలు అవుతాయి. ఇక ఈయన చేసే బిజినెస్ రోజురోజుకీ పెరిగిపోతుంది.. సామ్రాజ్యంగా విస్తరిస్తుంది. అదే క్రమంలో కష్టాలు కూడా వస్తాయి. ఇక తర్వాత ఆ బిజినెస్ మానేసి కుటుంబంతో కలిసి స్పెయిన్ వెళ్లిపోతాడు. అక్కడే డాక్టర్ (కాజల్ అగర్వాల్)ను కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ.. 

కథనం:

ఎక్కడ్నుంచి వచ్చామని కాదు.. ఇక్కడ్నుంచి మనం ఎక్కడికి వెళ్లామనేది అవసరం. రణరంగం సినిమాలో ఓ అద్భుతమైన డైలాగ్ ఇది.. సినిమా చూస్తున్నపుడు కూడా ప్రేక్షకులకు ఇదే అనిపిస్తుందేమో..? ఎక్కడ మొదలై.. ఎక్కడో ముగిసింది.. మాఫియా కథలు ఇప్పటికే చాలా వచ్చాయి.. కానీ ఇదో రకం మాఫియా. తెలిసిన కథకే తన మార్క్ స్క్రీన్ ప్లే అద్ది.. మరింత కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు సుధీర్ వర్మ.. ఈ ప్రయత్నంలో ఫస్టాఫ్ వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వెళ్లింది రణరంగం.. దేవా అనే బ్లాక్ టికెట్స్ అమ్ముకునే కుర్రాడు.. స్పెయిన్‌లో డాన్ అయ్యే క్రమాన్ని చాలా బాగా చూపించాడు సుధీర్. అక్కడక్కడా లాజిక్స్‌కు అందని విధంగా కథ సాగినా కూడా తెరపై స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనిపిస్తుంటుంది.. దాంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫస్టాఫ్ చూసేస్తాం. పెద్దగా ట్విస్టులు లేకుండా సాఫీగా కథ సాగిపోవడం రణరంగంకు కాస్త మైనస్ అనిపించింది. ప్రజెంట్.. పాస్ట్ అంటూ కథ ముందుకు వెనక్కి సాగినా కూడా సాగదీసినట్లు అనిపించింది.. ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని నేపథ్యంగా తీసుకోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.. దానిచుట్టూ అల్లుకున్న కథ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. విశాఖపట్నం పోర్ట్ ఏరియా.. వాటి చుట్టూ ఇల్లీగల్ లిక్కర్ బిజినెస్.. అందులో జరిగే గొడవలు.. మధ్యలో హీరో ప్రేమ.. అన్నింటిని బాగానే సమకూర్చాడు సుధీర్ వర్మ. కానీ అసలు తంటాలన్నీ సెకండాఫ్‌లోనే వచ్చేసాయి. ఎందుకో తెలియదు కానీ ఫస్టాఫ్‌లో కనిపించిన పేస్ సెకండాఫ్‌లో కనిపించలేదు. కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్ ఈ కథలో ఏం చేసిందో అర్థం కాలేదు.. ఆమె వచ్చాక.. రాకముందు కథలో ఎలాంటి మార్పు కనిపించలేదు..

సెకండాఫ్ నెమ్మదించింది.. క్లైమాక్స్ మరీ సింపుల్‌గా తేల్చేసినట్లు అనిపించింది. శర్వానంద్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డాన్ పాత్రలో అదరగొట్టాడు.. మిడిల్ ఏజ్ పాత్రలోనూ ఆకట్టుకున్నాడు శర్వానంద్.. కళ్యాణి ప్రియదర్శన్ నటన బాగుంది. ఓవరాల్‌గా రణరంగంలో రణం బాగానే ఉంది.. కానీ కథనం ఇంకాస్త బాగుంటే అదిరిపోయుండేది.


నటీనటులు:

శర్వానంద్ రెండు కోణాలున్న పాత్రలో అదరగొట్టాడు. మాఫియా డాన్ పాత్రలో పిచ్చెక్కించాడు. మేకప్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. కళ్యాణి ప్రియదర్శన్ మంచి పాత్రలో కనిపించింది. స్క్రీన్ పై కూడా చాలా అందంగా ఉంది కళ్యాణి. కాజల్ అగర్వాల్ కారెక్టర్ పెద్దగా స్కోప్ లేదు. ఫ్రెండ్స్ పాత్రల్లో రాజా, సుదర్శన్, ఆదర్శ్ బాగా నటించారు. రంగస్థలం మహేష్ కూడా పర్లేదు. 

టెక్నికల్ టీం:

ప్రశాంత్ పిళ్లై సంగీతం పర్లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ముఖ్యంగా అమ్మవారి పాటను దర్శకుడు సుధీర్ వర్మ వాడుకున్న తీరు బాగుంది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. స్పెయిన్ అందాలతో పాటు విశాఖపట్నం అందాలను కూడా చక్కగా ఆవిష్కరించాడు. తన సినిమాటోగ్రఫీతో సినిమా స్థాయి పెంచేసాడు. నవీన్ నూలి ఎడిటింగ్ పర్లేదు. నడివి తక్కువగానే ఉన్నా అక్కడక్కడా బోరింగ్ సీన్స్ ఉన్నాయి. కేశవలో రివేంజ్ డ్రామా చూపించిన సుధీర్.. ఇక్కడా అదే చేసాడు. స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త తీసుకుండుంటే బాగుండేది. లాజిక్స్ పక్కనబెట్టి చూస్తే పర్లేదు అనిపిస్తుంది. 

చివరగా: రణరంగం.. టేకింగ్ స్ట్రాంగ్.. కథనం వీక్..

రేటింగ్ : 2.75 / 5

More Related Stories