English   

సరిలేరు నీకెవ్వరు నుండి ఇండియన్ ఆర్మీకి ట్రిబ్యూట్ !

Sarileru Neekevvaru
2019-08-15 22:20:01

భరత్ అనే నేను, మహర్షి సినిమాల వరుస బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నారు. F2 సినిమాతో వరుస హిట్స్ కొట్టిన డైరెక్టర్‌ అనిల్ రావిపూడి దర్శకత్వం వహింస్తున్న ఈ సినిమాని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రష్మిక మందనా లేడీ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి స్వాతంత్ర దినోత్సవ కానుకగా మహేష్ ఆర్మీ లుక్ లో ఉన్న ఒక పిక్ అలాగే ఒక సాంగ్ కూడా విడుదల చేశారు. దేవి శ్రీ స్వరపరించిన ఈ సాంగ్ గూజ్ బంప్స్ తెచ్చేలా ఉంది, దేశ సరిహద్దుల్లో సైనికులు దేశం కోసం ఎలా పోరాడుతున్నారో విజువల్‌గా చూపించారు. ‘భగభగమండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు’ అంటూ సాగిన ఈ పాటలో మహేష్ బాబు మేజర్ అజయ్ క్రిష్ణగా కనిపించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా చిత్రం విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More Related Stories