English   

ఏడాది పూర్తి చేసుకున్న గీత గోవిందం.. విజయ్ దేవరకొండ మైల్ స్టోన్.. 

Vijay Deverakonda
2019-08-16 09:03:12

అవునా.. అప్పుడే గీత గోవిందం సినిమా వచ్చి ఏడాదవుతుందా.. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. కాలం ఎంత వేగంగా వెళ్లిపోతుందో చెప్పడానికి ఇదే సాక్ష్యం. అల్లు  అరవింద్ సమర్పణలో  GA 2  పిక్చర్స్ పతకంపై బన్నీ వాసు నిర్మించిన గీత గోవిందం 100 కోట్లకు పైగా వసూలు చేసింది. విజయ్ దేవరకొండను ఈ చిత్రంతో స్టార్ హీరోగా మార్చేసాడు దర్శకుడు పరుశురాం. ఇక రష్మిక మందన్న అయితే తెలుగు ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఈ చిత్రంతో. ఈ సినిమా విడుదలై నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఫ్యామిలీ సబ్జెక్ట్స్ డీల్ చేయడంలో పరుశరామ్ పరిణితి చూపించాడు. ఈ అనుభవంతోనే గీత గోవిందం చిత్రాన్ని అటు యూత్ కి ఇటు ఫామిలీస్ కి నచ్చేలా తెరకెక్కించాడు. దానికి తోడు విజయ్ నటన.. రష్మిక గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. నిజానికి ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు.. కచ్చితంగా హిట్ అవుతుందని తెలుసు కానీ ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని మాత్రం ఎవరూ కనీసం ఊహించలేదు. గీతా ఆర్ట్స్ సినిమా అనే బ్రాండ్ గీత గోవిందంపై ఉండటమే దీనికి ముఖ్య కారణం. అర్జున్ రెడ్డితో యూత్ ను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండను కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసింది ఈ చిత్రం. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడానికి సంగీతం కూడా కారణమే. గోపీసుందర్ దీనికి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ముఖ్యంగా ఇంకేం ఇంకేం కావాలే పాట అయితే 355 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. మొత్తానికి గీతగోవిందం ఏడాది పూర్తైన సందర్భంగా అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.

More Related Stories