English   

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన రాజమౌళి.. 

Rajamouli
2019-08-16 09:14:57

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం నుంచి చిన్న అప్ డేట్ వచ్చినా కూడా పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు రాజమౌళి మాత్రం ఎప్పట్లాగే సీక్రేట్స్ అన్నీ దాచేసి తన పని తాను చేసుకుంటున్నాడు. పంద్రాగస్ట్ కదా.. కచ్చితంగా ఈ చిత్రం నుంచి ఏదో ఓ లుక్ విడుదల చేస్తాడని ఆశించిన అభిమానులకు అనుకోని షాక్ ఇచ్చాడు దర్శక ధీరుడు. అటు రామ్ చరణ్ కానీ.. ఇటు ఎన్టీఆర్ కానీ ఎవరి లుక్ విడుదల చేయలేదు. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల్లో నటిస్తున్నా కూడా ఎందుకో తెలియదు కానీ ఈ సారి పంద్రాగస్ట్ ను పట్టించుకోలేదు రాజమౌళి. ఎన్టీఆర్, చరణ్ లుక్స్ ఇప్పటి వరకు సీక్రేట్ గానే ఉంచాడు ఈ దర్శకుడు. ఇప్పటికే వీళ్లెలా ఉండబోతున్నారో బయట చూస్తుంటే అర్థమవుతుంది. ప్రస్తుతం RRR షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్.. అల్లూరిగా రామ్ చరణ్ కనిపిస్తున్నారు. వీళ్లలో జూనియర్ లుక్ పంద్రాగస్ట్ రోజు వస్తుందనే అనుకున్నారంతా. కానీ అది జరగలేదు. జులై 30, 2020న సినిమా విడుదల కానుంది. మొత్తానికి తమకు షాక్ ఇచ్చినా కూడా సినిమా బాగొస్తే చాలనుకుంటున్నారు అభిమానులు.

More Related Stories