English   

సైరా నరసింహా రెడ్డికి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్..

Pawan Kalyan
2019-08-16 11:18:36

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. అలాగే సినిమా కార్యక్రమాలతో కూడా బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. మొన్నీమధ్య తెలకపల్లి రవి రచించిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చాడు పవన్ కళ్యాణ్. అక్కడ సినిమా ముచ్చట్లు ఎన్నో మాట్లాడు జనసేనాని. ఈ మధ్య ఈయన చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాకు వాయిస్ ఓవర్ అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పక్క చిరంజీవి మరో వైపు పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాయిస్ అభిమానులను అలరిస్తుంది. ఇప్పటి వరకు ఏ సినిమా పవన్ కళ్యాణ్ తన స్వరాన్ని అరువు ఇవ్వలేదు. ఇప్పుడు అన్నయ్య కోసం తమ్ముడు గళాన్ని విప్పుతున్నాడు. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశం లో వచ్చే పవన్ కళ్యాణ్ వాయిస్ ఆ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకు వెళుతుందని తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పరిచయం చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ స్క్రీన్ పై కనిపిస్తుందని.. అది విన్న తర్వాత అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఉప్పొంగి పోతారని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. దానికి తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. పవన్ వాయిస్ తోనే కథ మొదలవుతుంది. అక్కడినుంచి అసలు చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది సైరా నరసింహారెడ్డి. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది. ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియో సినిమాపై అక్షరాలను ఆకాశానికి చేర్చింది.

More Related Stories