English   

బ్లేడ్ గణేష్ గా బండ్ల గణేష్...లుక్ లీక్ !

 Bandla Ganesh
2019-08-16 13:52:40

ఆయన కమెడియన్‌గా అందరికి సుపరిచితుడే, కాలం కలిసివచ్చి ఆ తర్వాత బడా నిర్మాతగా ఎదిగాడు. ఆపై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బయటకు కూడా వచ్చేశాడనుకోండి. ఈ పాటికే ఆయనెవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా, అవును ఆయనే బండ్ల గణేష్. నటుడిగా, సినీ నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ రాజకీయాల్లోకి వచ్చి బ్లేడ్ గణేష్ గా మారాడు. ‘డిసెంబర్ 11.. ఉదయం 11 గంటల తరువాత నా ఇంటికి రండి. వచ్చేటప్పుడు షార్ప్‌గా పీక తెగే 7’O Clock బ్లేడ్ తీసుకుని రండి.. ఒకవేళ మహా కూటమి ఓడిపోతే.. 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా. ఇది నా ఛాలెంజ్..హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్‌ గా వేసుకుంటావో నీ ఇష్టం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయం’ అంటూ ఆయన చేసిన శపథం హైలైట్ గా నిలిచింది. అయితే ఆయనకు రాజకీయాలు రావని తప్పుకోవడంతో ఇప్పుడు ఆయన మళ్ళీ సినిమాల మీదా, వ్యాపారాల మీదా ద్రుష్టి పెట్టాడు. 

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరులో ఆయన మళ్ళీ కమెడియన్ అవతారం ఎత్తనున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మద్యనే సినిమాలో కీలకమైన ట్రైన్ షెడ్యూల్ ని శరవేగంగా షూట్ చేస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్ షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఫోటోలు రీసెంట్ గా బయటకు వచ్చాయి.  ఈ ఫోటోలలో బండ్ల గణేష్ తో పాటు దర్శకుడు అనిల్.. హీరోయిన్ రష్మిక..హరితేజ  తదితరులు, సంగీత తదితరులు ఉన్నారు. ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది.ఆయన పేరు బ్లేడ్ గణేష్ అని అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా ఏవేవో మాట్లాడే పాత్రను బండ్ల కోసం అనిల్ రాశాడని ప్రచారం జరుగుతోంది.

More Related Stories