హెబ్బాను డైరెక్ట్ చేయనున్న కౌశల్

బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా ఓవర్ నైట్‌స్టార్‌గా మారిపోయాడు నటుడు కౌశల్. ఒక్క దెబ్బకి ఎందరో అభిమానులను ఆయన సొంతం చేసుకున్నాడు. కౌశల్ ఆర్మీ పేరుతో గ్రూపుగా ఏర్పడి హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ర్యాలీలు చేసి తమ ప్రేమను చాటుకున్నారు. బిగ్‌బాస్–2 విజేతగా కౌశల్ నిలవడంతో ఆ ఆర్మీ ముఖ్య పాత్ర పోషించింది. అయితే బిగ్ బాస్ 2 విన్నర్ అయినప్పటికీ తానూ సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఈ విషయం మీద సోషల్ మీడియాలో కూడా చాలా మంది ట్రోల్స్ చేసారు. ఆయన ప్రెఉ మీదే ఏర్పడిన కౌశల్ ఆర్మీ కూడా ఇదే ప్రశ్నను సంధించింది. తాజాగా ఈ విషయం మీద కౌశల్ కూడా స్పందించాడు. తన జీవితాన్ని చూసుకోవడం కంటే తన భార్య జీవితాన్ని చూసుకోవడమే ముఖ్యమని, ఆమె ఆరోగ్యం కంటే తనకు ఏది ఎక్కువ కాదని, ఆమె ఆరోగ్యం బాగయ్యాక సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చాడు. తాజాగా కౌశల్ తన సోషల్ మీడియా వేదికగా కౌశల్ ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే త్వరలోనే 'కుమారి 21F' ఫేం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. అంటే సినిమా అనుకునేరు కాదండోయ్ యాడ్ డైరెక్షన్. ఆయన ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇద్దరూ దిగిన పిక్‌ను షేర్ చేసి 'టైటిల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి.. నా మల్టీటాస్కింగ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిల్మ్ కోసం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేస్తున్నా' అని బిగ్ బాస్ టైటిల్ గురించి రాసుకొచ్చాడు.