English   

సైమా అవార్డుల్లోనూ సత్తా చాటిన మహానటి, రంగస్థలం

 SIIMA 2019
2019-08-16 15:43:01

ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక నిన్న మొదలయిన సంగతి తెలిసిందే, అబుదాబిలోని ఖ‌తార్‌లో జరుగుతోన్న ఈ వేడుకలో కొద్ది సేపటి క్రితమే సైమా అవార్డ్స్-2019 విజేతల పేర్లను ప్రకటించారు. ఈ అవార్డుల్లో కూడా తెలుగు నుండి మహానటి, రంగస్థలం సినిమాలు సత్తా చాటాయి. ఈ అవార్డుల్లో తెలుగు కేటగిరీ నుంచి ఉత్తమ చిత్రంగా 'మహానటి' ఎంపికైంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు అవార్డులకి కూడా సుకుమార్‌, రాంచరణ్‌కు దక్కాయి, అయితే విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడిగా  గీతగోవిందం సినిమాకు గాను విజయ్ దేవరకొండకు అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా మహానటి నుండి కీర్తి సురేష్ ని అవార్డు వరించగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటిగా రంగస్థలం సినిమాకి సమంతని వరించింది. ఇక ఉత్తమ సహాయ నటిగా రంగస్థలం సినిమాకి అనసూయని అవార్డు వరించింది. అలాగే ఉత్తమ సహాయ నటుడుగా మహానటి సినిమాకి రాజేంద్రప్రసాద్ కి అవార్డు వచ్చింది. ఇక ఉత్తమ హాస్యనటుడుగా హలో సినిమాకి సత్య, ఉత్తమ విలన్ గా శరత్ కుమార్(నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా), ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ రంగస్థలం, ఉత్తమ గేయరచయిత-చంద్రబోస్ రంగస్థలం, ఉత్తమ నేపథ్య గాయకునిగా అనురాగ్ కులకర్ణి RX100, ఉత్తమ డెబ్యూ నటుడుగా కల్యాణ్ దేవ్(విజేత), ఉత్తమ డెబ్యూ నటిగా పాయల్ రాజ్‌పుత్(RX100), ఉత్తమ డెబ్యూ దర్శకుడు-అజయ్ భూపతి(RX100), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు(రంగస్థలం), ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ(రంగస్థలం), సోషల్ మీడియా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ విజయ్ దేవరకొండలకు ఈ అవార్డులు వరించాయి.

More Related Stories