English   

ఎవరు ఫస్ట్ డే కలెక్షన్స్ !

 Evaru
2019-08-16 15:51:24

క్షణం గూడచారి సినిమాలతో వరుస్ హిట్స్ కొట్టిన అడివి శేష్ హీరోగా తాజాగా ఎవరు అనే సినిమా చేశాడు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అడివి శేష్, నవీన్ చంద్ర, రెజీనా కాసాండ్ర ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సస్సెన్స్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వెంకట్ రాంజీ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాకి అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఇక ఈ సినిమాను పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మించారు. రిలీజ్ కు ఒకరోజు ముందే అంటే బుధవారమే ఈ సినిమా కొందరు సిని సెలబ్రిటీస్ కోసం స్పెషల్ ప్రీమియర్ వేసి చూపించారు. ఎవరు ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా. శర్వా హీరోగా వచ్చిన రణరంగం సినిమా అనుకున్నంతగా లేకపోవడంతో ఈ సినిమాకి కలిసి వచ్చే అంశంగానే కనిపిస్తోంది.  క్రైమ్ సన్నివేశాలు, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు ఈ సినిమాకి ప్లస్ పాయింట్ లు గా చెబుతున్నారు. ఈ సినిమాకి దర్శకుడు చాలా సీరియస్ స్క్రీన్ ప్లే రాసుకున్నా కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టినా కూడా ప్రేక్షకులు ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తోంది. ఓవరాల్‌గా చిన్న చిన్న లోపాలు అన్నీ పెద్దగా కనిపించకుండా సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా తెలుగు స్టేట్స్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా 1.65 కోట్ల షేర్ సాధించింది. 0.62 కోట్ల వాటా వసూలు చేసిన గూడచారి సినిమాని అధిగమించిన క్రమంలో ఈ సినిమా ఆదివి శేష్‌ కెరీర్ లో భారీ ఓపెనింగ్ అనే చెప్పాలి. తెలుగు స్టేట్స్‌లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 7 కోట్లకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ సాదించాలి అంటే ఏడూ కోట్ల దాకా కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక ఏరియా వైజ్ కలెక్షన్స్ చూస్తే నిజాం 0.64 కోట్లు, సీడెడ్ 0.16 కోట్లు, యుఎ 0.21 కోట్లు, గుంటూరు 0.13 కోట్లు, తూర్పు 0.21 కోట్లు, కృష్ణ 0.15 కోట్లు, పశ్చిమ 0.10 కోట్లు, నెల్లూరు 0.05 కోట్లు అలా ఏపీ తెలంగాణా కలిపి 1.65 కోట్లు కలెక్ట్ చేసింది.  
 

More Related Stories