English   

సాహోను ముంచేస్తున్న మీడియా.. కోలీవుడ్‌లో ప్రభాస్‌కు షాక్.. 

Prabhas Saaho
2019-08-17 09:59:20

సాహో సినిమా మరో 12 రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఎలాంటి కష్టాలు లేకుండా సాగిపోతుంది. కానీ తొలిసారి సాహోకు పెద్ద కష్టం వచ్చింది. అది కూడా మీడియా రూపంలోనే వచ్చింది. అవును.. ఇప్పుడు మీడియా సాహో సినిమాకు సపోర్ట్ చేయడం లేదు. ఇదే ఇప్పుడు సంచలనం. ప్రభాస్ సినిమాకు మీడియా నుంచి ఊహించని రియాక్షన్ వస్తుంది. అయితే మన తెలుగు మీడియాతో ప్రభాస్ కు ఎలాంటి కష్టాలు రావడం లేదు కానీ తమిళనాట మాత్రం పరిస్థితులు మరోలా ఉన్నాయి. అక్కడ కొన్ని రోజులుగా నిర్మాతలకు, జర్నలిస్టులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇదే ఇప్పుడు సాహో కొంప ముంచేలా కనిపిస్తుంది. జర్నలిస్టులకు సరైన గుర్తింపు ఇవ్వట్లేదని కొన్ని రోజులుగా వాళ్లు నిర్మాతలతో గొడవ పడుతూనే ఉన్నారు. ఇదే చిలికి చిలికి గాలి వానలా మారుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈ క్రమంలోనే సాహోకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలనుకున్న నిర్మాతలకు షాక్ ఇచ్చారు మీడియా. దాంతో సాహో యూనిట్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే సరైన సహకారం అందించడం లేదు. దాంతో వాళ్లను పిలిచి మాట్లాడే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. కానీ మీడియా వింటుందా లేదా అనేది చూడాలి. తమిళనాట మిగిలిన పెద్ద సినిమాలకు కూడా తిప్పలు తప్పడం లేదు. చెన్నై ప్రెస్ మీట్ తర్వాత మైసూరు, కోచి, ముంబైలో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆగస్ట్ 18న రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మొత్తానికి సాహోను మీడియా బాగానే ముంచే పనిలో పడింది.

More Related Stories