English   

చిరంజీవి లుక్ తో ఆడుకుంటున్న యాంటీ ఫ్యాన్స్.. పెరుగుతున్న ట్రోలింగ్.. 

Chiranjeevi
2019-08-17 10:07:06

సైరా సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. 64 ఏళ్ళ వయసులో కూడా చిరంజీవి తన సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆయన కష్టం చూసి అంతా అయ్యో అనుకుంటున్నారు కూడా. ఇక ఇదిలా ఉంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం చిరు లుక్ తో ఆడుకుంటున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి లుక్ సరిగ్గా విడుదల చేయలేదు దర్శక నిర్మాతలు. మొన్న విడుదలైన మేకింగ్ వీడియోలో కూడా చిరు లుక్ ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా కనిపించలేదు. దాంతో చిరు లుక్ దాచి పెట్టడంపై యాంటీ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. చిరంజీవి లుక్ మొత్తంగా చూపించే ధైర్యం కూడా దర్శక నిర్మాతలకు లేదు.. అసలు సైరాలో చిరంజీవి తప్ప అందరూ బాగున్నారంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఈ విషయంలో ట్రోలింగ్ మరీ ఎక్కువ అయిపోతుండటంతో మెగా ఫ్యాన్స్ కు మండిపోతుంది. ఎందుకు తమ హీరోను అలా టార్గెట్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. టీజర్ లో అయినా కచ్చితంగా చిరు లుక్ విడుదల చేస్తారా లేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. పవన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నపుడు విడుదలైన లుక్స్ కూడా చిరు యాంటీ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. అక్కడ కూడా రక్తం చిందిన మొహంతో ఏదో అలా కనిపిస్తున్నాడు కానీ పూర్తి లుక్ కాదు. మొత్తంగా సోషల్ మీడియా మెగా ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందిప్పుడు.

More Related Stories