English   

మళ్ళీ మీడియా ముందుకు వెళ్ళకు...తాప్సీకి కంగనా సిస్టర్ చురకలు 

Rangoli Chandel
2019-08-17 15:40:08

బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద నటిగా పేరొందినది ఎవరంటే తడుముకోకుండా చెప్పే సమాధానం కంగనా రనౌత్ అని. ప్రేమ వ్యవహారాలు మొదలు, క్యాస్టింగ్ కోచ్ మొదలు ఆమె రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. అలాంటిది గత కొన్నాళ్లగా హీరోయిన్ కంగనా రనౌత్ కంటే.. ఆమె సోదరి రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు తన సోదరి కంగనాపై విమర్శలు చేసే వారందరికీ ఘాటుగా సమాధానం ఇస్తూ ఇటీవల హాట్ టాపిక్ గా మారింది రంగోలి. తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ మళ్ళీ తాప్సీని టార్గెట్ చేసింది. రంగోలి, హీరోయిన్ తాప్సి మధ్య అప్పాలతో మొదలైన మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా `మిషన్‌ మంగళ్` సినిమాలో నటించిన తాప్సీ ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ.. `ఓ మహిళ మరో మహిళకు అండగా ఉండాలని కంగన ఎప్పుడూ చెబుతుంటుంది కదా, మరి ఆమె `మిషన్‌ మంగళ్‌` సినిమాని ఎందుకు అభినందించలేదు. ఈ సినిమాలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరి ఆమె ఏ ఒక్కరినీ ఎందుకు మెచ్చుకోలేదు ?` అని తాప్సి ప్రశ్నించింది. 

ఇందుకు రంగోలీ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఈ మేడమ్‌ (తాప్సి) రోజూ కంగన మీద ఏదో ఒక దాడి చేస్తూనే ఉంది, అరె భాయ్ అసలు నువ్వేం చేశావని నిన్ను మెచ్చుకోవాలి ? అక్షయ్‌ కుమార్‌, విద్యాబాలన్‌ సినిమాలో రెండు నిమిషాల నిడివి ఉన్న పాత్రలో నటించడమా? లేక అమితాబ్‌ బచ్చన్‌ సినిమాల్లో ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తూ చిన్న చిన్న పాత్రలు చేయడమా? ఏమని మెచ్చుకోమంటావ్‌? ఓ గొప్ప నటి (కంగన) మీద నువ్వు కామెంట్లు చేస్తున్నావ్‌. ఒక గొప్ప నటి మీద కామెంట్స్ చేస్తే నువ్వేం గోప్పదానివి కావు...నువ్వేం చిన్న పిల్లవి కాదు. నీది కూడా నా సోదరి వయసే. అయినా నీ కెరీర్‌లో ఏం సాధించావని నిన్ను మెచ్చుకోవాలి. ఒకసారి నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసుకో. కంగన గురించి నువ్వు చేసే కామెంట్స్ మాట్లాడటానికి మాత్రమే మీడియా వాళ్ళు నీ దగ్గరకి వస్తారు. అంతే కానీ నీ సినిమాల గురించి నువ్వు సాధించిన వాటి గురించి ఎవ్వరూ ఒక్క ప్రశ్న కూడా అడగరు. మళ్ళీ దీని గురించి మీడియా ముందుకు వెళ్లకు. నాకు ట్విటర్‌లో  సమాధానం చెప్పు' అంటూ తాప్సీపై విరుచుకుపడింది రంగోలీ.

More Related Stories