నమిత రీ ఎంట్రీ...అయ్యే పనేనా ?

ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగిన నమిత తరువాత బాగా బరువు పెరగడంతో క్రమంగా సినిమాలు తగ్గించేసింది. ఆ తర్వాత ఆమెకి ఆఫర్లు బాగా తగ్గి ఇతర భాషల్లో అడపాదడపా సినిమాలు చేస్తున్నా చాలా ఏళ్ళుగా తెలుగు పరిశ్రమ మాత్రం ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. చివరగా బాలయ్య సరసన ‘సింహ’లో నటించిన ఆమె టాలీవుడ్ లో మరే సినిమా అయితే చేయలేదు. అయితే మిగతా భాషలలో కూడా క్రమంగా ఆమె తెరమరుగు అయ్యింది, 2016లో వచ్చిన పులి మురుగన్(మన్యం పులి) సినిమాతో ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తుందని భావించినా 2017లో తెలుగాబ్బయిని ప్రేమ పెళ్లి చేసుకుని సినిమాలకి మళ్ళీ బ్రేక్ ఇచ్చింది. అయితే ఆమె మళ్ళీ తన రీ ఎంట్రీ చేస్తున్నట్టు చాలా ఏళ్ల తర్వాత తమిళంలోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు గత ఏడాది ప్రచారం జరిగింది. స్లిమ్ గా మారిన ఈ భామ తమిళంలో ఒక మూవీలో ఛాన్స్ దక్కించుకుందనిమ్ తమిళంలో అగంభావం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగులో అహంభావం పేరుతో రిలీజ్ కానుందని అన్నారు. శ్రీమహేష్ దర్శకత్వంలో గతేడాది చివర్లో ప్రారంభం అయిన ఈ సినిమా ఏమయిందో తెలీదు. అయితే ఆమె మరో సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారని అంటున్నారు. ఆమె కధలు వింటున్నారని ఎలా అయినా ఏదో ఒక సినిమా ద్వారా మళ్ళీ లైం లైట్ లోకి రావచ్చని అంటున్నారు. చూడాలి మరి ఆమె ఏ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుందో ?