English   

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వర్మ రచ్చ...ఎవరెవరి పాత్రలు ఉన్నాయంటే ?

Kamma Rajyam Lo Kadapa Reddlu
2019-08-17 18:06:57

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముంగిట లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా రిలీజ్ చేసి తెలుగు రాజకీయాన్ని రసవత్తరంగా మార్చిన మార్చిన వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ మరో సినిమాకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ను కూడా ఆయన రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో వివాదానికి తావే ఉండదని ట్వీట్ చేసిన వర్మ టీడీపీ బాస్  చంద్రబాబు మీద కూడా ఒట్టు వేశారు. ఈ పాటను కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు వచ్చిన తర్వాత.. అంటూ మొదలుపెట్టారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో అన్న ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను..’తో ప్రారంభమయ్యే ఈ పాటతో  ఆసక్తి పెంచేలా ప్లాన్ చేశారు. అలాగే అసెంబ్లీలో జరిగిన వాదనలను చూపిస్తూ కత్తులు లేవిపుడు.. చిందే నెత్తురు లేదిపుడు..అంటూ పాటను ఒక రేంజ్ లో చూపించారు. ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ఉన్న ముఖ్యపాత్రలు ఏవేవి ఉంటాయి అనే దాని మీద కొంత సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఎవరెవరి పాత్రలు ఉంటాయంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు కుమారుడు లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, వారి కుమారుడు దేవాన్ష్, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని, మాజీ సీకర్ కోడెల శివప్రసాద్ రావు, మాజీ మంత్రులు గంటా, అచ్చెన్న, ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతా రామ్, మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు, ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్, సుజనా చౌదరి వంటి వారి పాత్రలు ఈ సినిమాలో ఉండనున్నాయి. వర్మ ప్రస్తుత పరిస్థితులే ప్రధాన లైన్ గా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ పాత్రలతో స్పష్టమవుతోంది.

More Related Stories