సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సర్వం సిద్ధం...స్పెషల్ సర్ప్రైజ్ లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషన్ సాహో. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి, ఇక ఈరోజు సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో జరగబోతున్న 'సాహో' ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం భారీ ఎత్తున్న ఏర్పాట్లు చేశారు. సాహో సినిమాలో షూట్ చేసిన రకరకాల కార్లు బైకుల బొమ్మలతో ఒక స్పెషల్ స్టేజ్ నిర్మించారు. ఈ ఈవెంట్ కోసం టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరోని ప్రత్యేక అతిథిగా హాజరు కమ్మని కోరినట్టు చెబుతున్నారు. ఆయన ఎవరో క్లారిటీ లేదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని మాత్రం బయటకు రాకుండా ఒకేసారి ఈవెంట్ లో రివీల్ చేసి అందరినీ ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంలో యూనిట్ ఉందని చెబుతున్నారు.
ఆ హీరోనే కాక ఈ ఫంక్షన్ కు అతిధులుగా రాజమౌళి అల్లు అరవింద్ లను కూడా పిలిచినట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్, ఇందులో నటించిన వారు మినహా బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ ఫంక్షన్ కు రావడం లేదని అంటున్నారు. ఈ ఫంక్షన్ కు ప్రత్యేకంగా బాలీవుడ్, తమిళ కన్నడ మళయాళ మీడియా ప్రతినిధులతో పాటు రంగ మీడియా ప్రతినిధులను పిలిచారట. ఈవెంట్ అయ్యాక వారందరికీ ప్రభాస్ తనదైన స్టైల్ లో రామోజీ ఫిలిం సిటీలోని ఒక హోటల్ లో గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, సాహో ఫీవర్ మాత్రం మొదలయిందనే చెప్పాలి. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో సాహో సినిమా తెరకెక్కగా, ఒకేసారి ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, లాల్ వంటి టాప్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు.