English   

మలయాళ ఎంట్రీకి సిద్దమయిన తమన్నా

tam
2019-08-18 16:10:22

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మిల్క్ బ్యూటీ తమన్నా త్వరలో మలయాళంలో సినీ తెరంగ్రేటం చేస్తున్నట్టు సమాచారం. మనోజ్ సరసన శ్రీ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెర మీద ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ భామ ఆ సినిమాతో పెద్దగా బ్రేక్ తెచ్చుకోకున్నా హ్యాపీడేస్ సినిమాతో బ్రేక్ తెచ్చుకుంది. అప్పటి నుండి దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన తమన్నా బాహుబలి లాంటి ప్రేస్టేజియస్ మూవీలో నటించినా ఆమెకి ప్రస్తుతం పెద్దగా క్రేజ్ లేదు. సరైన సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇక నటనకి గుడ్ బై చెప్తుందేమోనని అనుకున్న సమయంలో ఎఫ్ -2 సక్సెస్ తో మళ్ళీ కొంచెం బిజీ అయ్యింది ఈ భామ.

ఇక తాజాగా  తమన్నా త్వరలో మలయాళం లో కూడా అలరించబోతుందని అంటున్నారు. అది కూడా తనకు అచ్చివచ్చిన హారర్ జానర్ సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది. మలయాళ డైరెక్టర్ సంధ్య మీనన్ డైరెక్షన్ లో ఒక హారర్ సినిమా ప్లాన్ జరుగుతోందట. సెంట్రల్ జైల్ నేపథ్యం లో జరిగే ఒక కధతో ఈ సినిమా తెరకెక్కుతోందట. దీనికి `సెంట్రల్ జైలిలే దెయ్యం` అంటే సెంట్రల్ జైలు దెయ్యం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఇండియ‌న్ ఆర్ట్స్ స్టూడియో నిర్మించనుందని అంటున్నారు. ఇక త‌మ‌న్నా త్వ‌ర‌లో సైరా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో పాటు క్వీన్ రీమేక్‌గా తెర‌కెక్కిన ద‌టీజ్ మహాల‌క్ష్మీ చిత్రం షూట్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది.

More Related Stories