English   

ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే ?

biggboss3
2019-08-18 16:20:45

ఎట్టకేలకి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నాలుగో వారానికి చేరుకుంది. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన 15మంది సభ్యులలో నటి హేమ, రిపోర్టర్ జాఫర్ ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిపోగా, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశించిన ట్రాన్స్ జెండర్ తమన్నా కూడా గత వారం బిగ్ బాస్ హౌస్ ని వీడాల్సి వచ్చింది. అయితే ఈ వారం ఎలిమినేషన్ కి గాను, ఏడుగురు సభ్యులను అనుకున్నారు. వారిలో శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్, శివ జ్యోతి, రోహిణి, మరియు రవి కృష్ణ ఉన్నారు. అయితే వీరిలో రాహుల్ కానీ శివ జ్యోతి కానీ ఎలిమినేట్ అవుతారని భావించినా షాకింగ్ గా రోహిణి ఎలిమినేట్ అయ్యిందని చెబుతున్నారు. గత సీజన్ లానే ఈ సీజన్ ని కూడా లీకుల బెడద తప్పడం లేదు. ఇక ఇది నిజమో కాదో రేపు తేలనుంది.

More Related Stories