English   

మళ్ళీ అ ! అనిపిస్తాడా ?

director
2019-08-18 16:45:52

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అ!’సినిమా ఈ మధ్యనే జాతియ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మొన్న ప్రకటించిన 66వ నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ ఎఫెక్ట్స్, బెస్ట్ మేకప్ అవార్డ్స్ గెలుచుకొంది. నాని, ప్రశాంతి త్రిపురనేని నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాకి ప్రస్తుతం ఒక సీక్వెల్‌ రానుందని అంటున్నారు. రెండో సినిమాగా కల్కి సినిమా తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే ఈ సీక్వెల్‌ కి స్ర్కిప్టును కూడా సిద్ధం చేశారట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి గతంలో వచ్చిన అ సినిమాకి అసలు పోలికే ఉండదట. ఈ సీక్వెల్ ఫస్ట్ పార్ట్ కు కొనసాగింపు కాదని ఈ సీక్వెల్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుందని, ఫస్ట్ పార్ట్ కొన్ని కథలను కూర్చి సమకూరిస్తే ఈ సినిమా మాత్రం సింగిల్ స్టోరీ తో నడుస్తుందని అంటున్నారు. మొదటి భాగంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను ఇప్పటికే సంప్రదించగా దానికి ఆమె కూడా ఇంప్రెస్ అయ్యారని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే సినిమాకి ఇంకా ఆమె ఒప్పుకోలేదని, చెప్పుకొచ్చారు. అలాగే త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తిని కూడా ఈ సినిమా కోసం అనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాని కూడా జాతీయ స్థాయిలో పలు భాషలలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ విషయాలన్నిటినీ ప్రశాంత్ ఒక ఆంగ్ల పత్రికతో చెప్పినట్టు కధనం ప్రచురించింది.

 

More Related Stories