English   

ప్రభాస్ అభిమానుల రచ్చ...కాసేపు నిలిచిన ఈవెంట్

prabhas
2019-08-18 19:27:09

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన మూవీ సాహో. రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరుగుతోంది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ క్రమశిక్షణగా లేకుండా బారికేడ్లు దాటి సభా వేదిక వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో వారిని అదుపుచేయడానికి పోలీసుల చాలా శ్రమించాల్సి వచ్చింది. కొందరి మీద లాఠీ ఝులిపించినా కంట్రోల్ కాక పోవడంతో నిర్వాహకుల చేత వార్నింగ్ ఇప్పించారు. అయినా వారు వినకపోవంతో ఒకానొక సందర్భంలో ఇలా చేస్తే ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినా అభిమానులు వినకపోవడంతో ఈవెంట్ కొంతసేపు నిలిచిపోయింది. యాంకర్ లు హేమంత్, సుమలు కూడా ఈ విషయం మీద అభిమానులను సైలెంట్ గా ఉండమని కోరుతున్నారు. చూడాలి మరి అభిమానులు ఏమాత్రం కంట్రోల్ అవుతారో.

 

More Related Stories