English   

నిక్కరేసుకొచ్చి కధ చెప్పాడు....నమ్మలేదు కానీ !

prabhas
2019-08-19 08:06:02

భారత సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సాహో ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. ఇది టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అతిపెద్ద ప్రీ రిలీజ్ వేడుక అని చెబుతున్నారు. ఇక ఈ కార్యక్రమం చివరిలో అభిమానులను ఉద్దేశించి ప్రభాస్ మాట్లాడారు. ప్రభాస్ చాలా తక్కువ విషయాలే మాట్లాడినా దర్శకుడు సుజీత్‌ మీద మాత్రం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా చేయడానికి అంగీకరించిన సీనియర్ టెక్నీషియన్స్ అందరికీ ఈ సందర్భంగా పేరుపేరునా ప్రభాస్ కృతజ్ఞతలు చెప్పారు. ఇక సుజీత్ గురించి మాట్లాడుతూ సుజీత్ తనకు కథ చెప్పడానికి నిక్కరేసుకుని వచ్చాడని, అప్పుడతని వయసు 24 సంవత్సరాలని చెప్పారు. అప్పటికే యూవీ క్రియేషన్స్‌లోనే ‘రన్ రాజా రన్’ చేశాడని, ఆ సినిమా చేసేటప్పటికి అతని వయసు 22 ఏళ్లని ప్రభాస్ చెప్పుకొచ్చారు. సుజీత్ వచ్చి కథ చెబితే ఒక 40 ఏళ్ల వ్యక్తిలా అనిపించాడని ప్రభాస్ చెప్పాకొచ్చారు . కధను బట్టి దీనిని యూవీ పెద్ద సినిమా చేసిందని చెప్పాడు. షూటింగ్ ప్రారంభం కావడానికి సంవత్సరం ముందునుంచే సుజీత్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాడని, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ని పెట్టారు సాబు సార్, మది సార్, కమల్ సార్, శేఖర్ సార్ వీళ్లందరినీ ఎలా హ్యాండిల్ చేస్తాడా అని ప్రమోద్, వంశీ మేమందరం టెన్షన్ పడ్డామని ఒక్కరోజు కూడా కోపమనేది లేకుండా భలే మేనేజ్ చేశాడని అన్నారు. ఎందుకో సుజీత్ గొప్ప డైరెక్టర్ అవుతాడని ప్రభాస్ ప్రశంసించారు. ఇక వంశీ ప్రమోద్ లాంటి స్నేహితులు అందరికీ ఉండాలని ప్రభాస్ చెప్పుకొచ్చారు. వంద కోట్ల లాభం వచ్చే అవకాశం ఉన్నా తన స్నేహం కోసం అవేమీ పట్టించుకోలేదని పేర్కొన్నారు.

More Related Stories