ఆమె ఎలిమినేషన్...చెంప మీద కొట్టుకుంటూ ఏడ్చిన శివజ్యోతి

అనుకున్నదే అయ్యింది, లీకేజ్ వార్తలు వచ్చినట్టుగానే నాలుగో వారం ఎలిమినేషన్ లో భాగంగా నటి రోహిణి ఎలిమినేట్ అయ్యింది. నాలుగో వారం ఎలిమినేషన్ జోన్లో ఏడుగురు ఉండగా శివజ్యోతి, వరుణ్ సందేశ్ ఇద్దరూ శనివారానికి సేఫ్ కాగా బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహుల్ లు డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఇక శని వారం ఎపిసోడ్లో మాస్క్‌లు తొలగించుకుని మీరు మీలా ఉండాలని చెప్పిన నాగార్జున ఆదివారం మాత్రం బిగ్ బాస్ హౌస్‌ని కోర్టుగా మార్చేశారు. ఎలిమినేషన్లో ఉన్న ఐదుగురుని లాయర్లు, జడ్జ్‌లు, నిందితులుగా సెపరేట్ చేశారు. నాగార్జున ఒక పేరు చెప్పి వాళ్లు హౌస్‌లో ఎందుకు ఉండకూడదో కారణాలు వాదనలుగా వినిపించాలని కోరారు. ముందుగా బాబా భాస్కర్ ని నిందితుడిని చేస్తూ హౌస్‌లో ఎందుకు ఉండకూడదో చెప్పాలని మహేష్ విట్టాను వాదించమని లాయర్ బాధ్యతలు అప్పగించారు. దీంతో మహేష్ బాబాకి తెలుగు రాదని, ఆయనకు ఇగో ప్రాబ్లమ్‌తో పాటు ఎప్పుడూ ఇంటికి వెళిపోదామని ఉందని వాదనలు వినిపించారు.
గేమ్ ఇచ్చినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఆడతారని ఆయన ఎప్పుడూ కిచెన్‌లో ఉంటారని మహేష్ వాదనలు వినిపించారు. ఇక మహేష్ వాదనల్ని అబ్జెక్ట్ చేసిన బాబా వీటికి నేను ఒప్పుకోను అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు సరిగా రాకపోవడం వల్లే ప్రాబ్లమ్ అని నాకు ఇగో లాంటిది లేదంటూ వాదించుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ టాస్క్ అనంతరం అందరూ ఊహించినట్టుగానే రోహిణి ఎలిమినేట్ అయ్యింది. రోహిణి ఎలిమినేషన్‌తో బాగా ఏడ్చేసింది శివజ్యోతి. ఒక రకంగా రోహిణి ఎలిమినేట్ కావడానికి శివజ్యోతే కారణం కావడంతో వెక్కి వెక్కి మరీ ఏడ్చింది జ్యోతి. గత వారం నామినేషన్ టైంలో శివజ్యోతి, రోహిణిలు గుసగుసలాడటంతో రోహిణిని డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారు బిగ్ బాస్. దీంతో చెంపపై కొట్టుకుంటూ బోరు బోరున ఏడ్చింది శివజ్యోతి. మొత్తంగా నాలుగో వారం ఎలిమినేషన్లో రోహిణి బయటకు వెళ్లడంతో ఇప్పుడు 12 మంది మాత్రమే హౌస్‌లో మిగిలారు. ఇక రేపటి ఎపిసోడ్లో ఐదోవారం ఎలిమినేషన్‌కి నామినేషన్స్ ఉండటంతో ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారనే దాని మీద ఆసక్తి నెలకొంది
.