English   

బిగ్ బాస్ హౌస్ లో నటి ఆత్మహత్యాయత్నం

biggbosst
2019-08-19 08:47:51

తెలుగు బిగ్ బాస్ కంటే ముందే తమిళ బిగ్‌బాస్‌ కూడా మొదలయ్యింది. తెలుగుతో పోల్చుకుంటే తమిళ బిగ్ బాస్ ప్రారంభం నుంచీ వివాదాలతో రచ్చ రేపుతోంది. కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న తమిళ బిగ్ బాస్ వివాదాలకు నిలయంగా మారిపోయింది. ఏకంగా అందులోని వారిని అరెస్ట్ చేయడనికి పోలీసులు గతంలో వస్తే ఇప్పుడేమో ఏకంగా తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌ లో ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. తమిళ హాస్య నటి మధు మిత ఆత్మహత్యాయత్నా నికి పాల్పడింది. తమిళంలో ఒరు కల్‌ ఒరు కన్నాడీ చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పోటీ చేస్తున్నారు. 50 రోజులకు పైగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న మధుమిత ప్రస్తుతం హౌస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ శనివారం అనుకోకుండా ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు సమాచారం. హౌస్‌ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మధు మిత చెప్పారట. దీంతో దీంతో ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు కమల్ హాసన్. గత రెండు సీజన్లలో కూడా వివాదాస్పద ఘటనలు జరిగినా ఇలా ఆత్మహత్యలు లాంటివి అయితే జరగలేదు. అయితే తమిళ బిగ్ బాస్ చూసిన వారు ఈ బిగ్ బాస్ కంటే తెలుగు బిగ్ బాస్ వెయ్యి రెట్లు నయమని అంటున్నారు.

More Related Stories