English   

జక్కన్నకీ తప్పలేదు....అదే నచ్చిందట !

Rajamouli
2019-08-19 09:25:45

సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో వేడుకగా జరిగింది.ఈ వేడుకలో ప్రభాస్- సుజీత్ ల గురించి రాజమౌళి మాట్లాడుతున్నప్పుడు ఓ అభిమాని వేదికపైకి దూసుకొచ్చాడు. రాజమౌళి పక్కన మోకాలి మీద కూర్చుని ప్లీజ్ అన్నట్టుగా బతిమలాడడం కలకలం రేపింది. స్పీచ్ మధ్యలో ఆపిన రాజమౌళి ఇబ్బందిగా వెళ్లమని కోరారు. ఆయన వెళ్ళాక రాజమౌళి తన స్పీచ్ కంటిన్యూ చేశారు. రాజమౌళి మాట్లాడుతూ.. ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ల హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారనీ, ఒక్క ప్రభాస్ సినిమాని మాత్రమే అందరు హీరోల ఫ్యాన్స్ హిట్టవ్వాలని కోరుకుంటారని ఎందుకంటే ప్రభాస్ ఎవరి గురించీ చెడుగా మాట్లాడడని అన్నారు. అలాగే ప్రభాస్‌కి చాలా దూరదృష్టి ఎక్కువని, ‘బాహుబలి’ కథ చెప్పినప్పుడే తాను తన తరవాత సినిమా ఏంటి అనే ఆలోచన మొదలుపెట్టాడని అన్నారు.

బాహుబలి చేస్తున్నప్పుడే దని తరవాత ఏం సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి నన్ను పదేపదే అడుగుతా ఉండేవాడని అన్నారు. ఆ టైమ్ లో.. సుజీత్ చెప్పిన కథ ప్రభాస్ కు బాగా నచ్చిందని, అప్పుడు స్టార్ డమ్ ను కాకుండా కేవలం కథను మాత్రమే నమ్మి ప్రభాస్ ఈ సినిమా అంగీకరించాడని అన్నారు. అదే తనకు నచ్చిందని అన్నారు. అయితే ఈ సినిమాని సుజీత్ ఎలా చేస్తాడనే సందేహాన్ని ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే క్లారిటీ ఇచ్చేశాడని పేర్కొన్నారు రాజమౌళి. సాహో బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని చెప్పారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు ప్రభాస్ ఏమడిగితే అది చేసేస్తారని, ప్రభాస్ అంటే వాళ్లకు అంత ఇష్టమని, అంత నమ్మకమని అన్నారు. అందుకే సినిమా మీద చాలా ఖర్చుపెట్టారని అన్నారు. ప్రభాస్ ఇప్పటికే ఆలిండియా స్టార్. అక్కడి నుంచి అతన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని జక్కన్న పేర్కొన్నారు. చివరిగా మొత్తం టీమ్ కి అభినందనలు తెలిపిన ఆయన తన స్పీచ్ ముగించారు.

More Related Stories