English   

సైరా కోసం రజనీ, మోహన్ లాల్, యష్ ల మాట సాయం !

 Yash Mohanlal
2019-08-19 09:45:12

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టింది సినిమా యూనిట్. అందులో భాగంగా ఈ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ సమయంలోనే ఈ సినిమా టీజర్ ను కూడా ఇరవయ్యో తారీఖున అంటే రేపు రిలీజ్ చేస్తామని పేర్కొంది. ఇప్పటికే రిలీజయిన చిరంజీవి, నయనతార, జగపతిబాబులకు సంబంధించిన మోషన్ పోస్టర్స్‌మ్ మొన్న రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోకి అద్భుతమైన స్పందన రావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా టీజర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించారు. 

ఈ మధ్య దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పరిచయం చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ స్క్రీన్ పై కనిపిస్తుందని దర్శక నిర్మాతల నుండి అందుతున్న సమాచారం. పవన్ వాయిస్ తోనే కథ మొదలవుతుందని అన్నారు. అయితే తెలుగులో పవన్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా పవన్ తో చెప్పించినా ఈ సినిమా అనాలుగు బాషలలో రిలీజ్ కానున్న నేపధ్యంలో ఈ కన్నడలో రాక్ స్టార్ యష్ తో, మలయాళంలో మోహన్ లాల్ తో, తమిళంలో రజనీలతో కూడా సేం వాయిస్ ఓవర్ చెప్పించారని అంటున్నరు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ, రేపే టీజర్ రానుండడంతో ఆ డౌట్ తీరిపోనుంది. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది.  

More Related Stories