English   

ఎవరు సినిమా టీమ్ కి అల్లు అర్జున్ ప్రసంశలు

Allu Arjun
2019-08-19 11:08:46

అడవి శేష్ - రెజీనా జంటగా తెరకెక్కిన ‘ఎవరు’ సినిమా గత గురువారం విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. క్షణం, గూఢచారి వంటి థ్రిల్లర్ సినిమాలతో హిట్స్ కొట్టిన అడవి శేష్ ఎవరు సినిమాతోనూ హిట్ కొట్టేసాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడమే కాక శేష్ కెరీర్ లోనే ఎవరు సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా మీద టాలీవుడ్ సెలెబ్రిటీల నుండి సపోర్ట్ లభిస్తోంది. ఇప్పటికే టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా నచ్చిందని చెబుతూ శేష్ కి తన బ్యానర్ లో ఒక సినిమా ఛాన్స్ కూడా ఇవ్వగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా యూనిట్ ని అల్లు అర్జున్ ప్రశంసించాడు. 

ముందుగా ఈ సినిమా టీమ్ కి కంగ్రాట్స్ చెప్పిన ఆయన, గత రాత్రి ఈ సినిమా చూశానని చెప్పుకొచ్చారు. ఇది ఒక అద్భుతమైన మర్డర్ మిస్టరీ సినిమా అని చెప్పుకొచ్చాడు. ఈ మర్డర్ మిస్టరీ సినిమాలో ఎన్నో ట్విస్ట్ లు, మలుపులు ఉన్నాయని పేర్కొన్నారు. నిజంగా సినిమా బాగా నచ్చినదన్న ఆయన ఈ సినిమా రచనా, సాంకేతిక విభాగాల  వర్క్ కూడా బాగుందని ప్రశంసించారు. శేష్ కి వరుసగా మంచి సినిమాలు పడ్డాయని, ఈ సినిమా హ్యాట్రిక్ అనే చెప్పాలని అన్నారు. అలాగే రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ నటన కూడా బాగుందని బన్నీ ప్రశంసించారు. ఇక పీవీపీకి అలాగే దర్శకుడు రామ్ జీకి కూడా అల్లు అర్జున్ కంగ్రాట్స్ చెప్పారు. 
 

More Related Stories