English   

ముంబైలో సైరా ఈవెంట్...బాలీవుడ్ సమక్షంలో !

 Sye Raa Narasimha Redd
2019-08-19 15:40:27

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. బ్రిటీష్ వారి పాలనకు ఎదురు తిరిగిన తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమా తెరకెక్కించారు. షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన మేకింగ్ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా టీజర్‌ ని కూడా రేపు విడుదల చేయబోతున్నారు. ఇదే సందర్భంలో సైరా చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్‌ చరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 20వ తేదీన ముంబైలో ఒక ఈవెంట్ ను నిర్వహించనున్నారు. అంటే ఒకరకంగా ఈ ఈవెంట్ నుండి ప్రమోషన్ మొదలు పెట్టచ్చని అంటున్నారు. ఈ ఈవెంట్ లో పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటుగా అమితాబ్, చిరంజీవి, రామ్ చరణ్, విజయ్ సేతుపతి,సుదీప్ వంటి వారు కూడా పాల్గొననున్నట్టు సమాచారం. ఈ ఈవెంట్ అయ్యాక  హైదరాబాద్‌తో పాటు ఇతర దక్షిణాది నగరాల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాలు చేపడతారని అంటున్నారు. అలాగే ఈ ఈవెంట్ అయ్యాక చిరంజీవి విదేశాలకి వెళతారని, తన పుట్టిన రోజు వేడుకను విదేశాలలో జరుపుకోనున్నట్టుగా సమాచారం.

More Related Stories