English   

చిరంజీవిని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారా..

chiru
2019-08-19 20:25:35

ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. నిజానికి చిరంజీవికి ప్రస్తుతం సినిమాలు తప్ప మరో ధ్యాస లేదు. ఇదే విషయాన్ని ఆయన తాజాగా ఇంటర్వ్యూలో కూడా బయట పెట్టాడు. తనకు ప్రస్తుతం సినిమాలు తప్ప రాజకీయాలపై దృష్టి లేదని.. ఎవరైనా ప్రయత్నించినా కూడా అది కేవలం వారి ప్రయత్నంగా మిగిలిపోతుంది కానీ తను మాత్రం పాలిటిక్స్ వైపు వెళ్ళను అంటున్నాడు చిరంజీవి. ఇంతగా చెబుతున్నా కూడా బీజేపీ తమ పార్టీలోకి తీసుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చర్చలు జరిపారు. చిరంజీవి బీజేపీలో చేరి చేసేదేమీ లేక పోయినా కూడా జస్ట్ ఆయన స్టార్ పవర్ ఉంటే చాలు అని కోరుకుంటున్నారు కమలనాథులు. అయితే మరో వైపు మెగాస్టార్ మాత్రం తనకు రాజకీయాలు అచ్చి రావడం లేదని ఓపెన్ గానే ఒప్పుకుంటున్నాడు. అందుకే తన ఫోకస్ మొత్తం కేవలం సినిమాలు మాత్రమే అంటున్నాడు. చిరంజీవి ఇప్పటికే సైరా నరసింహారెడ్డి రిలీజ్ పనులతో బిజీగా ఉన్నారు. తర్వాత కొరటాల శివ సినిమాతో ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు అన్నయ్య. మరో మూడు నాలుగేళ్ల వరకు తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలకు కమిట్ మెంట్లు ఇచ్చేసాడు మెగాస్టార్. ఇలాంటి సమయంలో ఆయన రాజకీయాలు చేస్తాడని ఎవరూ ఊహించడం లేదు. ఒకవేళ బీజేపీ ఆ ఆ వైపుగా అడుగులు వేసినా కూడా అది కేవలం వాళ్ల ఆశ మాత్రమే అంటున్నాడు మెగాస్టార్. అంత ఓపెన్ గా చెబుతుంటే రాజకీయాలు చేయడం కష్టమే అనిపిస్తుంది. మరి చివరికి చిరు దారి ఎటువైపుగా పడుతుందో చూడాలి.

More Related Stories