English   

సాహో కలెక్షన్లపై వివి వినాయక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..

vv
2019-08-19 21:42:13

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రామోజీ ఫిలిం సిటీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో ఘనంగా జరిగింది. వేలాది మంది అభిమానుల సమక్షంలో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీల్లో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక సాహో ఓపెనింగ్స్ పై అన్ని చోట్ల చర్చ నడుస్తుంది. బాహుబలి 2 సినిమా తొలి రోజు ఏకంగా 120 కోట్లు తీసుకొచ్చింది. అందులో కేవలం తెలుగులో మాత్రమే 40 కోట్లకు పైగా ఉంది.. ఇక హిందీలో కూడా 50 కోట్ల వరకు తొలిరోజు వసూలు చేసింది ఈ చిత్రం. ఇక ఇప్పుడు సాహో ఎంత వసూలు చేస్తుందనే విషయంపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో వివి వినాయక్ ఈ చిత్ర ఓపెనింగ్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సాహో సినిమా తొలి రోజు కచ్చితంగా 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుందని చెప్పాడు ఈ దర్శకుడు. కేవలం హిందీలో మాత్రమే 50 కోట్ల షేర్ తీసుకొస్తుందని చెబుతున్నాడు వినాయక్. భవిష్యత్తులో ప్రభాస్ ఇంకా ఎదగాలని..

ఆయన 2000 కోట్లతో సినిమా చేయాలని కోరుకుంటున్నాడు వినాయక్. దానివల్ల తెలుగు సినిమా స్థాయి తో పాటు ఇండియన్ సినిమా స్థాయి కూడా పెరుగుతుందని భావిస్తున్నాడు వినాయక్. మరో వైపు ఆయన చెప్పడం కాదు కానీ నిజంగానే సాహో సినిమాతో ప్రభాస్ నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయిపోయాడు. బాహుబలి అంటే రాజమౌళి స్టామినాతో బ్లాక్ బస్టర్ అయింది. ఒకవేళ ఇప్పుడు కానీ సాహో హిట్ అయ్యింది అంటే కచ్చితంగా ప్రభాస్ రేంజ్ పెరిగిపోవడం ఖాయం. బాలీవుడ్లో కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం సులువు అయిపోతుంది. ఇక్కడి నుంచి తను చేసే ప్రతి సినిమాను ప్లాన్ చేసుకొని చేశాడంటే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు చోట్ల ప్రభాస్ జెండా పాతేయడం పెద్ద కష్టమైన పనేం కాదు.

More Related Stories