English   

బాలయ్య నయా లుక్...పండగ చేసుకుంటున్న అభిమానులు

Balakrishna
2019-08-20 09:07:15

సినిమా సినిమాకి వైవిధ్యమైన లుక్స్ లో కనపడతారని కొందరు హీరోలకి పేరుంది. ఇప్పుడు ఆ జాబితాలో బాలయ్య చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తమిళ్ టాప్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. జైసింహా తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోండడంతో ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం  బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ షూట్ కి వెళ్ళేప్పుడే బాలయ్య పూర్తిగా మారిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయినా అందులో క్లారిటీ లేదు, తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి బయటకు వచ్చిన బాలయ్య లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ పిక్ లో బాలయ్య లుక్ కంప్లీట్ గా మారిపోయింది. బాలయ్య వీరాభిమానులకు సైతం ఈ లుక్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్టైలిష్ గా కనిపించే ఫ్రెంచ్ బియర్డ్ లుక్ లో బాలయ్య చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య పోలీస్ ఆఫీసర్ నుంచి ఎలా గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనే స్టోరీతో ఈ కధ తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యుయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్రలో జగపతి బాబు యాక్ట్ చేస్తున్నాడని, జగపతి బాబు కూడా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియం చేయనున్నట్టు సమాచారం. బాలయ్య సరసన ఈ చిత్రంలో హాట్ బ్యూటీలు వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాకి రూలర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Related Stories