అల...వైకుంఠపురములో టబు పిక్ లీక్...ఆ రోల్ కాదా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చేశాక చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ అల వైకుంటపురంలో. సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంటున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొన్నటి వరకూ ఈ సినిమాకి సంబంధించి ఎన్నో టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, ఫైనల్ గా దానికి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అల...వైకుంఠపురములో అనే టైటిల్ ఫిక్స్ చేశాక ఈ సినిమా మీద మరింత ఆసక్తి పెంచారు. అయితే ఈ సినిమాలో టబు ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆమె నటుడు జై రామ్ తో నడుస్తున్న పిక్ ఒకటి వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఈ పాత్రకి సీనియర్ హీరోయిన్ టబును తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆమె జై రామ్ కి జంటగా కనిపించడంతో ఆమె బన్నీ తల్లి పాత్ర చేయడం లేదనేది స్పష్టం అయినట్టే. ఎందుకంటే మొన్న విడుదల చేసిన వీడియోలో బన్నీ తండ్రిగా మురళీ శర్మ నటించారు. దీంతో ఈ సినిమాలో ఆమె అత్త పాత్ర ఏమయినా చేస్తున్నారా, లేక హీరోయిన్ తల్లిగా నటిస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాలో సుశాంత్, నివేదా పెతురాజ్, నవదీప్ ప్రధాన పాత్రలలో సందడి చేయనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సినిమాని హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.