English   

యాక్సిడెంట్ వార్త అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన తరుణ్..

Actor Tarun
2019-08-20 12:08:28

హీరో తరుణ్ యాక్సిడెంట్ గురించి కొన్ని గంటలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈయన కారు డివైడర్ను ఢీకొందని.. అందులో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు అని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పుడు ఈయన స్పందించాడు. తన కారుకు యాక్సిడెంట్ అయింది అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు తరుణ్. ఆ వార్త అవాస్తవమని.. యాక్సిడెంట్ అయిన కారుకు ,తనకు సంబందంలేదని, రాత్రి నుంచి  తాను ఇంటి వద్దే ఉన్నానని.‌. తన కారు కూడా క్లేమంగానే ఉందని తరుణ్  తెలిపారు. ఈ వార్త ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో తనకు తెలియదని.. అసలు తనకు ఏ మాత్రం సంబంధం లేని ఈ వార్త చూసి తాను కూడా షాక్ అయ్యానంటున్నాడు తరుణ్. దయచేసి మీడియా వారు కూడా ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని ఆయన కోరుకుంటున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి సంచలన విజయాలు సాధించిన తరుణ్.. ఈ మధ్య పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయాడు. సినిమాలు మానేసి తన వ్యాపారాలు తాను చేసుకుంటున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ పోవడంతో ప్రస్తుతం బిజినెస్ తో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఇప్పుడు ఉన్నట్టుండి యాక్సిడెంట్ వార్తలతో మరోసారి వార్తల్లో నిలిచాడు.

More Related Stories