English   

మళ్లీ దర్శకుడు అవుతున్న మెహర్ రమేష్.. నమ్రత నిర్మాతగా..

Meher Ramesh
2019-08-20 13:37:59

మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేయాలంటే హీరోలు భయపడిపోతున్నారు. ఆయన ఇప్పటి వరకు నటించిన నాలుగు సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో.. ఈయనతో సినిమా అంటే దూరం పారిపోతున్నారు నిర్మాతలు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో తెరకెక్కించిన శక్తి.. వెంకటేష్ షాడో సినిమాలతో మెహర్ రమేష్ ఇమేజ్ పూర్తిగా దెబ్బ తింది. కంత్రీ కాస్త పర్లేదనిపించింది.. బిల్లా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. షాడో సినిమా వచ్చి 6 సంవత్సరాలు అయినా కూడా మెహర్ రమేష్ ఇప్పటివరకు మరోసారి దర్శకుడిగా మారలేదు. మధ్యలో కొన్ని కథలు రెడీ చేసుకున్న కూడా ఈయన నమ్మడానికి ఏ హీరో కూడా ధైర్యం చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నాడు. అయితే మెహర్ రమేష్ దర్శకుడిగా మారేది సినిమా కోసం కాదు.. వెబ్ సిరీస్ కోసం. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఈ మధ్య నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తోంది. సరైన కథలు వస్తే తన ప్రొడక్షన్ లో నిర్మించడానికి రెడీ అవుతుంది ఈమె. ఇందులో భాగంగానే మహేష్ రమేష్ చెప్పిన ఒక స్క్రిప్ట్ నచ్చి వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమవుతుంది నమ్రత శిరోద్కర్. ఆమె కేవలం నిర్మాతగా ఉండి ఈ వెబ్ సిరీస్ బాధ్యతను చూసుకోనుంది. ఇందులో జగపతి బాబు నటించబోతున్నాడని తెలుస్తుంది. ఒక లాయర్ అమ్మాయిలకు బానిస అయితే ఎలా ఉంటుంది అని లైన్ తో ఇది తెరకెక్కించబోతున్న ట్లు తెలుస్తోంది. దాంతోపాటు టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంక్రీత్యన్ కూడా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత మెహర్ రమేష్ మళ్లీ మెగాఫోన్ పడుతున్నాడు. మరి ఈసారైనా ఆయన సక్సెస్ ని అందుకుంటుందో లేదో చూడాలి.

More Related Stories