English   

మరికొన్ని గంటల్లో సైరా ప్రభంజనం.. టీజర్ కు కుదిరిన ముహూర్తం..

Sye Raa Narasimha Reddy
2019-08-20 13:47:45

సైరా నరసింహారెడ్డి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. చిరంజీవికి ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని ఇది నిరూపించింది. మొన్నటి వరకు సినిమాపై అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నా కూడా మేకింగ్ వీడియో విడుదల అయిన తర్వాత అవి మరో స్థాయికి వెళ్లిపోయాయి. కచ్చితంగా ఈ సినిమాతో చిరంజీవి తెలుగు సినిమా రికార్డులతో పాటు జాతీయ వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా తనకంటూ ఒక మార్కు క్రియేట్ చేస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. రామ్ చరణ్ కూడా దానికి తగ్గట్లుగానే  ప్రమోషన్స్ అన్ని చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఒక టీజర్, మేకింగ్ వీడియో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఆగస్టు 20న మరో టీజర్ విడుదల కానుందని ఇప్పటికే చెప్పారు దర్శక నిర్మాతలు. చిరంజీవి పుట్టిన రోజుకు రెండు రోజుల ముందుగానే సైరా టీజర్ విడుదలవుతుంది. ఆగస్టు 20 మధ్యాహ్నం 2:40 నిమిషాలకు ఈ టీజర్ విడుదల కానున్నట్లు పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇది చూసిన తర్వాత కచ్చితంగా సినిమాపై అంచనాలు ఆకాశానికి చేరుతాయంటున్నారు మేకర్స్. 200 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటూ వస్తున్న సినిమా సైరా. తన ఇమేజ్ ను పణంగా పెట్టి చిరంజీవి ఈ సినిమా చేస్తున్నాడు. 64 ఏళ్ళ వయసులో కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కోసం తనని తాను మార్చుకున్న తీరు అభిమానులతో ఔరా అనిపిస్తుంది. ఇక టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఎంతగా పెరుగుతాయో చూడాలి.
 

More Related Stories