English   

సైరా టీజర్ విడుదల.. విజువల్ వండర్‌తో వచ్చిన మెగాస్టార్.. 

Sye Raa Teaser
2019-08-20 16:28:14

సైరా టీజ‌ర్ వ‌చ్చేసింది. అన్న‌య్య అభిమానుల‌కు పండ‌గ మ‌ళ్లీ తెచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న సైరా టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత అభిమానులు ఆనందంతో గాల్లో గంతులేయ‌కుండా ఉండ‌లేరు. సురేంద‌ర్ రెడ్డి కూడా మ‌రో రాజ‌మౌళిలా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడ‌ని అర్థ‌మైపోతుంది. విజువ‌ల్ వండ‌ర్ కాదు.. దాన్ని మించి సైరా ముస్తాబ‌వుతుంది. ముఖ్యంగా వార్ సీన్స్ సినిమాలో హైలైట్ అవుతున్నాయ‌ని టీజ‌ర్ తోనే చూపించాడు ద‌ర్శ‌కుడు. ముందుగా చెప్పిన‌ట్లుగా టీజ‌ర్ లో చిరంజీవి త‌ప్ప ఇంకేం లేదు. మొత్తం ఆయ‌న‌పైనే ఫోక‌స్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సెక‌న్లు నిడివి ఉన్న ఈ టీజ‌ర్ తో ఇప్పుడు సినిమాపై అంచ‌నాలు మ‌రో స్థాయికి చేరిపోయాయి. 

ఇప్పటి వరకు చిరంజీవిని అక్కడక్కడా మాత్రమే చూపిస్తూ వచ్చిన సురేందర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా చూపించేసాడు. అన్నయ్య ఈ ఏజ్ లో చేసిన రచ్చ చూసి అభిమానులు పండగ చేసుకోకుండా ఉండలేకపోతున్నారు. రేనేటి వీరుల్లారా చరిత్రలో మనం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.. కానీ చరిత్ర మనతోనే మొదలవ్వాలి అంటూ చిరంజీవి చెప్పిన డైలాగులు చరిత్రకు నాందీ పలికేలా కనిపిస్తున్నాయి. దానికితోడు యుద్ధ సన్నివేశాలు కూడా మరో స్థాయిలో ఉన్నాయి. కత్తిసాము.. గుర్రపు స్వారీ అన్నీ సైరాపై అంచనాలు పెంచేస్తున్నాయి. అంతేకాదు.. చరిత్ర ఝాన్సీ లక్ష్మీభాయ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వీరులను గుర్తు పెట్టుకుంది కానీ ఆంగ్లేయులపై తొలిసారి దండయాత్ర చేసిన ఉయ్యాలవాడను మరిచిపోయిందంటూ పవన్ చెప్పిన వాయిస్ ఓవర్ కూడా అదిరిపోయింది. కచ్చితంగా రేపు థియేటర్స్ లోకి సినిమా వచ్చిన తర్వాత విజిల్స్ పడుతూనే ఉంటాయని చెప్పడం అతిశయోక్తి కాదేమో..?  

ఇండియ‌న్ స్క్రీన్ పై చూడ‌న‌టువంటి భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు.. అత్యున్న‌తంగా ఉండే విజువ‌ల్ ఎఫెక్ట్స్.. ఒక్క‌టేమిటి అన్నీ మ‌రో స్థాయిలో సినిమాలో ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తుంది. ఖైదీ నెం.150ని త‌క్కువ బ‌డ్జెట్ లో ముగించేసిన చ‌ర‌ణ్.. ఈ సారి మాత్రం తండ్రి సినిమా కోసం 200 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాడు. ఈ సినిమాలో గొరిల్లా యుద్ధాలు కూడా హైలైట్ కానున్నాయి. టీజ‌ర్ విడుద‌లైన క్ష‌ణం నుంచే సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుంది. ఆగ‌స్ట్ 22న చిరు బ‌ర్త్ డే అయితే రెండు రోజుల ముందే ఆ ర‌చ్చ మొద‌లైంది. అమితాబ్ బ‌చ్చ‌న్.. న‌య‌న‌తార‌.. త‌మ‌న్నా.. సుదీప్.. జ‌గ‌ప‌తిబాబు.. విజ‌య్ సేతుప‌తి లాంటి స్టార్స్ అంతా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది.

More Related Stories