English   

ఈ శుక్రవారం రిలీజ్ అవనున్న పది సినిమాలు

movies
2019-08-20 18:54:40

సినీ ప్రేక్షకులకు, అభిమానులకు శుక్రవారం వచ్చిందంటే పండుగే. ఎందుకంటే ఆరోజునే కొత్త సినిమాలు వెండితెరను తాకుతాయి. సాధారణంగా ప్రతీ శుక్రవారం మహా అయితే నాలుగు సినిమాలు విడుదలైతే పెద్ద విశేషం. కానీ టాలీవుడ్‌లో ఈ వారం దాదాపు 10 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఏఎ వారం దాటితే సాహో రంగంలోకి దిగుతాడు, ఆ సాహో ప్రభంజనం తట్టుకోవడం కష్టమే. ఆ క్రేజ్ ఎప్పటి వరకూ ఉంటుందో కూడా చెప్పలేం. ఆ త‌ర్వాత గ్యాంగ్ లీడ‌ర్, వాల్మీకి, సైరా వంటి చిత్రాలు వరుసగా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా ఇదే అదునుగా భావించి ఈ శుక్ర‌వారం ఏకంగా ప‌ది సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మ‌య్యాయి. వీటిలో జనానికి కాస్త దగ్గరయిన సినిమా ఏదయినా ఉందంటే అది తమిళ్‌లో సక్సెస్‌ అయి తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి పేరుతో రీమేక్ అయిన కనా అనే సినిమా ఒక్కటే. ఈ సినిమాతో పాటు ఏదైనా జరగొచ్చు సినిమా మీద కూడా కాస్త అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలతో పాటుగా 3)నేనే కెడి నెం 1, 4)జిందా గ్యాంగ్, 5)బాయ్, 6)ఉండిపొరాదే , 7)నివాసి, 8)నీతోనే హాయ్ హాయ్, 9)కనులు కనులు దోచేనే, 10)హవా అనే సినిమాలు రిలీజ్ కానున్నాయి. కనీసం ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని కూడా జనానికి పెద్దగా తెలియక పోవడంతో ఈ సినిమాల భవితవ్యం ఏమిటో ఈ శుక్రవారం తేలనుంది.

More Related Stories