English   

ట్విట్టర్ లైవ్ లో ప్రభాస్, శ్రద్దాలు !!

prabhas
2019-08-20 19:43:09

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సాహో. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను డబుల్ చేస్తూ రామోజీ ఫిలిం సిటీలో 'సాహో' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమా రిలీజ కూడా దగ్గర పడడంతో డియర్ కామ్రేడ్ లానే సౌత్ ఇండియాలోని వివిధ నగరాల్లో ప్రమోషన్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతున్నది. అక్కడితో ఆగక సోషల్ మీడియా వేదికగా కూడా సినిమాను ప్రమోషన్ చేయడానికి యూనిట్ రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ ట్విట్టర్లో సందడి చేయబోతున్నారు.  ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నారు. ప్రభాస్, శ్రద్దాలను ఫ్యాన్స్ ప్రశ్నలు అడగాలి అంటే.. #AskTeamSaaho ట్యాగ్ ద్వారా ప్రశ్నలు అడగొచ్చని పేర్కొంటూ మేకర్స్ ఒక ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఆగస్టు 30న సాహో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు ముస్తాబవుతోంది. యూవీ క్రియేషన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సుజిత్ దర్శకత్వంలో భారీ యాక్షన్‌ థ్రిల్లర్ గా రూ. 350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది.

More Related Stories