English   

అన్ననే సవాల్ చేసిన తమ్ముడు !

akhil
2019-08-20 20:01:44

సోషల్ మీడియా లో ఛాలెంజ్ లు కొత్తేమీ కాదు.. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టిన రోజున ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్... ఇతర రాష్ట్రాలకూ విస్తరించింది. ఏకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాకా ఈ గ్రీన్ ఛాలెంజ్ చేరిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఛాలెంజ్ మొక్కల లక్ష్యం రెండు కోట్లకు చేరిన సందర్భంగా కేసీఆర్ సన్నిహితుడు ఎంపీ సంతోష్ కుమార్ మరోసారి మొక్కనాటారు. ఈ సారి కూడా మరో నలుగురికి మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసిరారు.

వైకాపా ఎంపీలు విజయ్ సాయి రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు జీఎమ్మార్ అధినేత గ్రంథి మల్లిఖార్జున్ రావు, నటుడు అక్కినేని అఖిల్​ను మొక్కలు నాటాల్సిందిగా సంతోష్ కోరారు. ఇక ఆయన విసిరిన ఛాలెంజ్ అక్కినేని హీరో అఖిల్ స్వీకరించాడు. తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి ఆ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశాడు. అయితే  మొక్కలు నాటిన అఖిల్...గ్రీన్  ఛాలెంజ్‌కు తన సోదరుడు నాగచైతన్య, మెగా హీరో వరుణ్ తేజ్‌ని నామినేట్ చేశారు. ఇద్దరూ తన ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటాలని సూచించాడు. మొత్తానికి మరో సారి టాలీవుడ్ అంతా ఈ గ్రీన్ ఛాలెంజ్ తిరిగెట్టే ఉంది.

More Related Stories