చిరంజీవి బర్త్ డే వేడుకలకు పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ కేరింతలు..

కొన్ని రోజుల కింది వరకు కూడా మెగా ఇంట్లో ఏ సంబరం జరిగినా కూడా పవన్ ఒక్కడే మిస్ అయ్యేవాడు. ఆయన మాత్రమే రాకుండా ఉండేసరికి ఎప్పుడూ ఏదో వెలితి కనిపించేది అభిమానులకు. నాలుగేళ్ల కింద నాగబాబు కూడా ఇదే ఇష్యూపై అభిమానులపై కోపం ప్రదర్శించాడు. అయితే ఇప్పుడు పవన్ కూడా రావడం అలవాటు చేసుకుంటున్నాడు. మెల్లగా తన అలవాట్లను మార్చుకుంటున్నాడు. మెగా వేడుకలతో పాటు బయటి వేడుకలకు కూడా పవన్ వస్తున్నాడు. ముఖ్యంగా చిరంజీవితో ఈ మధ్య ఎక్కువగా కలిసి కనిపిస్తున్నాడు ఈయన. మొన్నటికి మొన్న సైరా టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చాడు పవన్. ఇప్పుడు విడుదలైన ఈ టీజర్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసిపోతున్నారని తెలుస్తుంది. ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా మెగా బ్రదర్స్ కలిసి కనిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు అభిమానులకు కూడా సంతోషాన్ని కలిగించే విషయం. ఇప్పుడు ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మరో సంచలన విషయం బయటికి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలకు స్వయంగా పవర్ స్టార్ రాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు కన్ఫర్మ్ చేసాడు. ఆగస్ట్ 21 సాయంత్రం 6 గంటల నుంచి శిల్పకళావేదికలో ఈ వేడుక జరగనుంది. దీనికి మెగా హీరోలంతా హాజరు కానున్నారు. అయితే ఎంతమంది వచ్చినా కూడా పవన్ రావడం మాత్రం వాళ్లకు డబుల్ ఆనందాన్నిచ్చే విషయం. మరి ఈ మెగా బ్రదర్స్ కలయిక ఎలా ఉండబోతుందో..?