English   

బాలీవుడ్ రీ ఎంట్రీపై నోరు విప్పిన రామ్ చరణ్.. సిగ్గుపడే పని చేయలేదు..

ram
2019-08-20 20:44:08

ఆరేళ్ల కింద తొంద‌ర‌ప‌డి ఓ అడుగు వేసాడు చ‌ర‌ణ్. అలా త్వ‌ర‌ప‌డి చేసిన అడుగులు ఎప్పుడూ మంచివి కావ‌ని త్వ‌ర‌గానే తెలుసుకున్నాడు. తాను వేసింది త‌ప్ప‌ట‌డుగు అని కూడా తెలుసుకున్నాడు చ‌ర‌ణ్. అయితే ఆ త‌ప్ప‌ట‌డుగు ఇప్పుడు స‌రిదిద్దుకుంటానంటున్నాడు. ఆయ‌న చేసిన ఆ త‌ప్పు.. వేసిన త‌ప్ప‌ట‌డుగు పేరు బాలీవుడ్. అవును.. 2013లో ఈయ‌న జంజీర్ సినిమాతో బాలీవుడ్ కు వెళ్లాడు. తొలి సినిమానే ఏకంగా అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమాను రీమేక్ చేయ‌డంతో విమ‌ర్శ‌లు కూడా అందుకున్నాడు చ‌ర‌ణ్. సినిమా ఫ్లాప్ అయితే బాగున్ను కానీ మ‌నోడు బ్యాడ్ యాక్ట‌ర్ అనే ముద్ర కూడా ప‌డిపోయింది. దాంతో మ‌రోసారి బాలీవుడ్ వైపు చూడ్డం కూడా మానేసాడు మెగా వార‌సుడు. ఇన్నేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ ఉత్త‌రాది ఇండ‌స్ట్రీ గురించి మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు రామ్ చ‌ర‌ణ్. తాజాగా సైరా ఈవెంట్ లో చరణ్ ను బాలీవుడ్ మీడియా ఇదే ప్రశ్న అడిగారు. ఒక్క సినిమా ఫ్లాప్ కాగానే సిగ్గుపడి మళ్లీ ఇటు వైపు రావడం లేదా అని అడిగేసరికి.. చరణ్ కూడా ఉన్నదున్నట్లు చెప్పాడు. కథ నచ్చితే కచ్చితంగా బాలీవుడ్ సినిమా చేయడానికి తనకేం అభ్యంతరం లేదని చెప్పాడు. అంతేకాదు.. సిగ్గు పడాల్సిన అవసరం కానీ.. దాక్కోవాల్సిన తప్పు కానీ తాను చేయలేదని చెప్పాడు చరణ్. ఇప్పుడు రాజమౌళి సినిమాలో నటిస్తున్నానని.. 2020లో ఈ చిత్రంతో మళ్లీ హిందీ ఆడియన్స్ ముందుకు వస్తున్నానని చెప్పాడు చరణ్. ఈ సినిమాతో మళ్లీ మిమ్మల్ని ఆకట్టుకుంటానని ధీమాగా చెబుతున్నాడు మెగా వారసుడు. ఇదివరకే బాలీవుడ్ రీ ఎంట్రీపై చెప్పాడు మెగా హీరో. త‌న‌కు అక్క‌డ అక్కడ రాజ్ కుమార్ హిరాణి, విశాల్ భ‌ర‌ద్వాజ్ అంటే ఇష్ట‌మ‌ని.. వాళ్ల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పాడు. అయితే రెండోసారి ప్ర‌య‌త్నం చేస్తే క‌చ్చితంగా మంచి క‌థ‌తోనే వెళ్తాన‌ని.. ఈ సారి వెళ్తే విజ‌యం వ‌చ్చేలా చూసుకుంటాన‌ని చెబుతున్నాడు చ‌ర‌ణ్. అంటే మ‌న‌సులో బాలీవుడ్ కు వెళ్లాల‌ని ఉంది. కానీ ఇప్పుడు కాదు.. క‌థ కుదిర్తే అంటున్నాడు. మొత్తానికి RRR తర్వాత కచ్చితంగా మరోసారి చరణ్ అడుగులు అక్కడ పడేలా కనిపిస్తున్నాయి.

More Related Stories