English   

సాహో ఇష్యూలో అనవసరంగా నారా లోకేష్ ఇరుక్కున్నాడా..?

lokesh
2019-08-20 21:01:06

నారా లోకేష్ ఏంటి.. సాహో కేసులో ఇరుక్కోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరిగింది మరి. అసలు సంబంధమే లేని విషయంలో ఇప్పుడు ఇరుక్కుని నానా ఇబ్బందులు పడుతున్నాడు ఈయన. అసలు విషయం ఏంటంటే.. సాహోపై తెలుగు తమ్ముడు సీరియస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. వాళ్లు కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేసి నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని వెబ్ సైట్లు రాసిన కథనాలపై లోకేష్ సీరియస్ అయ్యాడు. అసలు అలాంటి వార్తలెలా రాస్తారంటూ ఫైర్ అయ్యాడు చినబాబు. ప్రపంచంలోని అందరు ప్రభాస్‌ అభిమానుల మాదిరే తాను కూడా 'సాహో' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ మధ్యే ఓ తమిళ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా జగన్ గురించి చెప్పుకొచ్చాడ ప్రభాస్. ఏపీ అభివృద్ధి చెందుతుందని.. జగన్ సమర్థత ఉన్న నాయకుడు అంటూ ప్రభాస్ చెప్పాడు. దాంతో 'సాహో'కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో టీడీపీ ప్రచారం చేస్తుందని ఓ వెబ్ సైట్ రాసింది. దాన్ని చూసిన లోకేష్ ట్విటర్‌ వేదికగా ఫైర్ అయ్యాడు. మరీ ఇంతగా దిగజారి వార్తలు రాసి.. అలా వచ్చిన డబ్బులతో ఎలా అన్నం తింటారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. సాహో సినిమాని భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు.. ఈ సినిమా కోసం తాను కూడా వేచి చూస్తున్నానని చెప్పాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని తాను కూడా కోరుకుంటున్నానని చెప్పాడు లోకేష్. తెలుగు దేశం మద్దతుదారులు సినిమాను చూసి ఇలాంటి తప్పుడు వార్తల్లో నిజంలేదని చాటి చెప్పండంటూ వరస ట్వీట్స్ చేసాడు నారా లోకేష్. ఆగస్ట్ 30న విడుదల కానుంది ఈ చిత్రం. అసలు లోకేష్ ఇంతగా ఈ ఇష్యూ గురించి స్పందించడంతో అంతా షాక్ అవుతున్నారు. అంతగా ఏం అవసరం ఉందంటూ వాళ్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

More Related Stories