English   

సైరాలో ఆ ఒక్క షాట్ అద్భుతం.. సింగంలా దూకిన మెగాస్టార్..

syeraa
2019-08-20 21:31:12

సైరా టీజర్ ఇప్పుడు మెగాభిమానులకు పండగే. ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరని టీజర్ ఇది. గతేడాది కూడా టీజర్ వచ్చినా అప్పటికి షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కేవలం 40 శాతం మాత్రమే పూర్తయింది. దాంతోనే టీజర్ కట్ చేసారు. కానీ ఇప్పుడు అలా కాదు. షూటింగ్ మొత్తం అయిపోయింది. దాంతో ఫుల్ ఫుటేజ్ వాడుకుని ఏకంగా నిమిషం 47 సెకన్ల నిడివి ఉన్న టీజర్ విడుదల చేసారు. ఇందులో చిరంజీవి క్లోజ్ షాట్స్ కూడా చాలానే ఉన్నాయి. అయితే ఎన్ని ఉన్నా కూడా ఒక్కటి మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. గుర్రంపై నుంచి దూకుతూ.. తనతో పాటు మరో ఇద్దరు బ్రిటిషర్స్ ను పట్టుకుని లాక్కొచ్చే ఆ షాట్ ఎన్నిసార్లు చూసినా కూడా కొత్తగానే అనిపిస్తుంది. అందులో చిరంజీవి ఎనర్జీ కూడా ఔరా అనిపిస్తుంది. అసలు సైరా టీజర్ లో అన్నయ్య పవర్ చూస్తుంటే బాపురే అనిపించక మానదు. అసలు ఈయనకు 64 ఏళ్లున్నాయా అని అనుమానాలు పదేపదే వస్తున్నాయి. అక్కడక్కడా డూప్ షాట్స్ మినహాయిస్తే.. అసలు ఈయన ఉన్న తీరు అమోఘమే. చిరంజీవి కోసమే సైరా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి. అక్టోబర్ 2న సైరా విడుదలైన తర్వాత కచ్చితంగా తెలుగు సినిమా రికార్డులు మాయమైపోయడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమాకు పోటీగా సాహో కూడా చాలా ముందుకు దూసుకెళ్లిపోతుంది. ఏదేమైనా సైరా టీజర్లో ఆ ఒక్క షాట్ మాత్రం అదరహో అనిపిస్తూనే ఉంది. అలాంటి మరో రెండు మూడు సన్నివేశాలు కూడా టీజర్ స్వరూపాన్ని మార్చేసాయి

More Related Stories