English   

ప్రభాస్ తో రామ్ చరణ్ చిరంజీవి.. సోషల్ మీడియాలో వైరల్ పిక్..

 Prabhas
2019-08-21 10:04:20

ఈ మధ్య కాలంలో ఒక ఫోటో ఇంతగా క్రేజ్ తెచ్చుకున్నది లేదు. ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు సూపర్ స్టార్లు ఉండే సరికి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. తాజాగా ముంబైలో సైరా టీజర్ లాంచ్ ముగిసిన తర్వాత రామ్ చరణ్ చిరంజీవి ప్రభాస్ ఒకే ఫ్రేమ్ లో కనిపించిన సంగతి తెలిసిందే. 24 గంటలు అయిపోయినా కూడా ఇప్పటికీ ఆ ఫోటో సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో వైరల్ గా తిరుగుతుంది. ఒకప్పుడు ఎవరికివారే యమునాతీరే అన్నట్లు ఉండే హీరోలు ఇప్పుడు మాత్రం అంతా కలిసుందాంరా అనుకుంటున్నారు. మన వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. తర్వాత పార్టీలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్. మహేష్ బాబు రామ్ చరణ్ ఎంతమంచి మంచి ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలుసు. ఇక జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా అంతే మంచి స్నేహితులు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభాస్, చిరంజీవి కూడా వయసుతో సంబంధం లేకుండా మంచి స్నేహితులు అయిపోయారు. ముంబైలో ఈవెంట్ అయిపోయిన తర్వాత ప్రభాస్, చిరంజీవి కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతుంది. అంతకు ముందు ఖైదీ నెంబర్ 150 సెట్లో బాస్ తో బాహుబలి ఫోటో దిగాడు. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ప్రభాస్ చిరంజీవి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు వీళ్లకు తోడుగా రామ్ చరణ్ కూడా ఉన్నాడు. మొత్తానికి మన తెలుగు హీరోలు బాంబేలో వెళ్లి బాలీవుడ్ ను కబ్జా చేయడం అనేది నిజంగా గర్వకారణం. ఈ ఫోటోలు చూసి అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు.

More Related Stories