English   

ఇండియాలో ఒక్కడే మెగాస్టార్.. చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..

 Amitabh Bachchan
2019-08-21 10:36:14

మెగాస్టార్ అంటే మనకు తెలియకుండానే గుర్తొచ్చే పేరు చిరంజీవి. ఊహ తెలిసిన నాటి నుంచి తెలుగు ఆడియన్స్ కు మెగాస్టార్ అంటే చిరంజీవి తప్ప మరో పేరు గుర్తుకు కూడా రాదు. అంతలా ఆ బిరుదుకు సరిపోయాడు ఆయన. అలాంటి మెగాస్టార్ తాను మెగాస్టార్ కాదు అని చెప్పాడు. ఇండియాలో ఉన్నది ఒకే ఒక్క మెగాస్టార్ అని మీడియా ముఖంగా అందరికీ తెలియజేశారు. సైరా టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిరంజీవి మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాలో ఇద్దరు మెగాస్టార్స్ కలిసి నటించారు కదా.. సెట్లో ఆ అనుభవం ఎలా ఉంది అంటూ మీడియా చిరంజీవిని ప్రశ్నించగా.. దానికి ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు ఈయన. అమితాబ్ బచ్చన్ సెట్ కు వచ్చినప్పుడు తాను మెగాస్టార్ అని ఎప్పుడు ఫీల్ కాలేదని.. ఇండియాలో ఉన్నది ఒకే ఒక్క మెగాస్టార్.. అది కూడా అమితాబ్ బచ్చన్ ఒక్కడే అంటూ సమాధానం చెప్పాడు చిరంజీవి. ఆయన ముందు ఎవరు మెగాస్టార్ కాదు.. తాను కూడా ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు అంటున్నాడు మన మెగాస్టార్. అయినా కూడా ఆయనతో తను పోల్చినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు ఈయన. ఇక అమితాబ్ బచ్చన్ సైరా సినిమాలో అతిథి పాత్రలో నటించాడు. ఇందులో చిరంజీవి గురువు పాత్ర ఆయనది. నిజ జీవితంలో కూడా తనకు అమితాబ్ బచ్చన్ గురువు లాంటి వాడే అంటున్నాడు మెగాస్టార్. కేవలం వారం రోజులు ఉండే పాత్రలో ఈయన నటించాడు. కొన్ని నిమిషాల పాటు మాత్రమే సైరాలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తాడు. అక్టోబర్ 2న ఈ చిత్రం 5 భాషల్లో విడుదల కానుంది.

More Related Stories