English   

 పూరీ విజయ్ లు తిరుగుతోంది అందుకేనా....

vijay devarakonda puri
2019-08-21 11:43:59

చాన్నాళ్ళగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న పూరీ ఇస్మార్ట్ శంకర్ హిట్టవ్వడంతో మాంచి ఊపు మీదున్నాడు. ఏకంగా విజయ్ దేవరకొండకే సినిమా కధ చెప్పి ఒప్పించేశాడు. అయితే అదంతా పుకారు అని అనుకుంటున్నా సమయంలో అధికారికంగా ప్రకటన కూడా చేయించి మరో షాక్ ఇచ్చారు.  అయితే ఈ సినిమా ప్రస్తుతం విజయ్‌ చేస్తున్న క్రాంతి మాధవ్‌ సినిమా విడుదలైన తర్వాత మొదలవ్వనుందని అన్నారు. కాని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సినిమా పనులు అప్పుడే మొదలైనట్లుగా తెలుస్తోంది.  ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యిందని, త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్నారని కూడా ప్రచారం మొదలయ్యింది. అయితే ఈ ప్రచారం ఊరికే మొదలవ్వలేదు. ఈ ఇద్దరూ కలిసి ఒక లొకేషన్ సెర్చ్ లో ఉన్న పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుందని అంటున్నారు. మొన్నటి వరకు వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది నవంబర్ నుండి ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో ఈ సినిమా మొదలయ్యి వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కాబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.  అయితే ఈ చిత్రంలో క‌థానాయిక‌గా శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్‌ని ఎంపిక చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో పూరీ- విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాతో జాన్వీ క‌పూర్ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అవుతుందా అనే దానిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.   

More Related Stories